ETV Bharat / sports

'నేనే సెలక్టర్ అయితే కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పిస్తా'

కోహ్లీ కెప్టెన్సీలో టీమ్ఇండియా ఆటగాళ్లు భయపడుతూ ఆడుతున్నారని వెల్లడించాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ లీ. తాను భారత జట్టు సెలక్టర్ అయితే రహానేను కెప్టెన్​గా కొనసాగిస్తానని తెలిపాడు.

kohli
కోహ్లీ
author img

By

Published : Feb 1, 2021, 10:52 AM IST

Updated : Feb 1, 2021, 11:21 AM IST

గతేడాది టీమ్​ఇండియా కెప్టెన్ కోహ్లీకి కలిసిరాలేదు అనే చెప్పాలి. ఎందుకంటే మూడు ఫార్మాట్లలో కనీసం ఒక్క సెంచరీ అయినా చేయలేకపోయాడు. ఫిబ్రవరిలో న్యూజిలాండ్​తో టెస్టు సిరీస్​లో ఓడిపోవడం, ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్​ ఓటమి, అనంతరం పింక్ టెస్టు ఓటమితో కోహ్లీ కెప్టెన్సీప విమర్శలు వచ్చాయి. రెండో టెస్టు నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న రహానె జట్టును విజయపథాన నడిపి గబ్బాలో చారిత్రాక విజయంతో జట్టుకు టెస్టు సిరీస్ అందించాడు. దీంతో టెస్టు కెప్టెన్సీపై భిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించాడు ఆస్ట్రేలియా మాజీ ఆల్​రౌండర్, బ్రెట్​లీ సోదరుడు షేన్ లీ. తాను టీమ్ఇండియా సెలక్టర్ అయితే రహానేకు కెప్టెన్సీ అప్పగిస్తానని వెల్లడించాడు.

"జట్టు గురించి ఆలోచిస్తే రహనే కెప్టెన్​గా కొనసాగేందుకు మద్దతిస్తా. కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్​మన్. కానీ రహానే జట్టు ఆటగాళ్ల గౌరవాన్ని పొందాడు. కోహ్లీ కెప్టెన్సీలో ఆడేందుకు ఆటగాళ్లు భయపడుతున్నారు. అందరూ ఫిట్​గా ఉండవచ్చు . ఫీల్డింగ్​లో బాగా రాణించవచ్చు. కానీ ఎందుకో భయపడుతున్నారు. అలాగే రహానే సారథ్యంలో ప్రశాంతంగా ఉంటున్నారు. కోహ్లీ కెప్టెన్సీ వదిలేస్తాడా? నాకు అనుమానమే. ఒకవేళ నేను టీమ్ఇండియా సెలక్టర్ అయితే రహానేను టెస్టు జట్టుకు కెప్టెన్​గా కొనసాగిస్తా. అప్పుడు జట్టు అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణిస్తుంది. ఇక సమయమే చెప్తుంది"

-షేన్ లీ, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

ఆస్ట్రేలియా గడ్డపై రహానే సారథ్యంలో చారిత్రక టెస్టు సిరీస్ గెలిచిన టీమ్ఇండియా ఇంగ్లాండ్​తో సిరీస్​ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఈ నెల 5న చెన్నై వేదికగా ఇరుజట్లు తొలి టెస్టులో తలపడనున్నాయి.

Last Updated : Feb 1, 2021, 11:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.