ETV Bharat / sports

అన్ని ఫార్మాట్లకు క్రికెటర్ వసీం జాఫర్​ వీడ్కోలు - జాఫర్​ గుడ్​బై

భారత జట్టు సీనియర్ క్రికెటర్​​ వసీం జాఫర్ ఆటకు గుడ్​బై చెప్పేశాడు. ఇప్పటివరకు రంజీల్లోనే ఆడుతున్న ఇతడు.. నేడు అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెప్పేశాడు. ఇటీవలే రంజీల్లో 150 మ్యాచ్​లాడి చరిత్ర సృష్టించాడు.

Indian Player WasimJaffer announces retirement from all forms of cricket
క్రికెట్​కు గుడ్​బై చెప్పేసిన వసీం జాఫర్​
author img

By

Published : Mar 7, 2020, 12:47 PM IST

Updated : Mar 7, 2020, 5:52 PM IST

టీమిండియాలో అవకాశాలు రాకున్నా రంజీల్లో సత్తాచాటుతున్న వసీం జాఫర్... క్రికెట్​లోని అన్ని ఫార్మాట్లకు నేడు (శనివారం) వీడ్కోలు పలికాడు. ఇకపై దేశవాళీ మ్యాచ్​ల్లోనూ బరిలోకి దిగనని స్పష్టం చేశాడు.

ఇటీవల రికార్డు

రంజీల్లో విదర్భకు ప్రాతినిధ్యం వహిస్తోన్న వసీం.. ఇటీవలే ఓ రికార్డు సృష్టించాడు. ఈ టోర్నీలో 12 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి బ్యాట్స్​మన్​గా ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్​లో 150 మ్యాచ్​లాడిన తొలి క్రికెటర్​గానూ నిలిచాడు.

Indian Player WasimJaffer announces retirement from all forms of cricket
వసీం జాఫర్​

రంజీల్లో 19 సీజన్లు ముంబయికు ప్రాతినిథ్యం వహించిన జాఫర్‌.. తర్వాత విదర్భ మారాడు. వరుసగా రెండు రంజీ టైటిల్స్‌ సాధించిన విదర్భ జట్టులో జాఫర్‌ సభ్యుడు. 1996-97 సీజన్​లో దేశవాళీ అరంగేట్రం చేసిన జాఫర్​.. తన ఆటతీరుతో భారత జట్టుకు ఎంపికయ్యాడు. 2000 నుంచి 2008 వరకు టీమిండియా​ తరఫున 31 టెస్టులు ఆడాడు. 1944 పరుగులు చేశాడు. ఇందులో 5 శతకాలు, 11 అర్ధసెంచరీలు, ఓ ద్విశతకం ఉన్నాయి. 2006లో విండీస్​పై 212 పరుగులు.. టెస్టుల్లో అతడి అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు. టీమిండియా తరఫున రెండు వన్డేలు కూడా ఆడాడు. 2008లో దక్షిణాఫ్రికాతో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్​లో చివరిసారి కనిపించాడు. కెరీర్​లో మొత్తం 24,875 పరుగులు, 67 శతకాలు చేశాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్​ అండర్​-16 నుంచి అండర్​-19 జట్లకు బ్యాటింగ్​ కోచ్​గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ జట్టుకు బ్యాటింగ్​ కోచ్​గా పనిచేస్తున్నాడు.

Last Updated : Mar 7, 2020, 5:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.