ETV Bharat / sports

"నా ఫేస్​బుక్​ అకౌంట్ హ్యాక్​ చేసింది ఈ అమ్మాయే"

author img

By

Published : Mar 22, 2020, 6:31 AM IST

టీమిండియా పేసర్​ భువనేశ్వర్​ కుమార్​ తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆక్తికర విషయాలు పంచుకున్నాడు. స్వీయ నిర్బంధంలో ఉన్న భువీ.. కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. తన భార్య నుపుర్​తో కలిసి ఓ చిట్​చాట్​లో పాల్గొన్నాడు.

Indian pacer Bhuvneshwar Kumar revealed with photo who hacked his Facebook account
"నా ఫేస్​బుక్​ అకౌంట్ హ్యాక్​ చేసింది ఈ అమ్మాయే"

టీమిండియా పేసర్​ భువనేశ్వర్​ కుమార్​.. మైదానంలో చాలా నెమ్మదిగా, కూల్​గా కనిపిస్తాడు. అయితే తనలోని మరో కోణమూ ఉందని తాజాగా వెల్లడించాడు. తన భార్య నుపుర్​​తో కలిసి ఓ చిన్నపాటి చాట్​ షోలో పాల్గొన్నాడు. పలు విషయాలు పంచుకున్నాడు. ఇందులో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సంగతుల్ని చెప్పాడు.

2012లో భారత్-పాకిస్థాన్​​ మధ్య జరిగిన వన్డేతో అరంగేట్రం చేశాడు భువీ. మంచి ప్రదర్శనతో టీమిండియాలో చోటు నిలబెట్టుకున్న ఇతడు.. గతేడాది మాత్రం గాయాలతో సతమతమయ్యాడు. చివరికి జట్టులో చోటూ కోల్పోయాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్​కు ఎంపికయ్యాడు. కరోనా కారణంగా అనూహ్యంగా అది రద్దయింది.

ఆమె హ్యాక్​ చేసింది

"నుపుర్​ చాలా సార్లు నా ఫేస్​బుక్​ పాస్​వర్డ్​ అడిగింది. ఎప్పుడూ ఏదో కారణం చెప్పి తప్పించుకునేవాడిని. ఓరోజు తను నా అకౌంట్​ పాస్​వర్డ్​ను నాకే చెప్పగా షాకయ్యా. నిజానికి ఆమె నా అకౌంట్​ హ్యాక్​ చేసింది. అందుకే అప్పట్నుంచి నేను ఫేస్​బుక్​ వాడటం మానేశాను"

-- భువనేశ్వర్ కుమార్​​, టీమిండియా బౌలర్

Indian pacer Bhuvneshwar Kumar revealed with photo who hacked his Facebook account
భువీ, నుపుర్​

అసూయపడేదాన్ని

ఎవరైనా మహిళా అభిమానులతో భువీ ఫొటోలు తీసుకుంటున్నప్పుడు తను బాగా ఆసూయపడేదాన్నని చెప్పింది నుపుర్​.

"ఎవరైనా అమ్మాయిలు ఫొటోలు తీసుకుంటున్నప్పుడు నేను అసూయపడేదాన్ని. అమ్మాయిలైతే కాస్త దూరంగా జరగమని చెప్పమనేదాన్ని. అయితే భువీ మాత్రం వాళ్లు నా దగ్గరగా వస్తే నన్నేం చేయమంటావ్​ అని ప్రశ్నించేవాడు"

-- నుపుర్​, భువీ భార్య

భువనేశ్వర్​ కుమార్​, నుపుర్​

త్వరగా ఔటవ్వకూడదని కోరుకుంటా

" నుపుర్​కు క్రికెట్​ గురించి.. రీప్లే , లైవ్​ మ్యాచ్​లకు తేడా తెలియదు. అయితే మైదానంలో బ్యాటింగ్​కు దిగేటప్పుడు త్వరగా ఔటవ్వకూడదని దేవుడ్ని ప్రార్థిస్తాను. ఎందుకంటే ఆ తర్వాత తను బాగా హేళన చేస్తుంది"

-- భువనేశ్వర్ కుమార్​​, టీమిండియా బౌలర్​

పాకిస్థాన్​పై అరంగేట్ర మ్యాచ్​లో భువీ

అప్పుడు భలే అనిపించింది

" పాకిస్థాన్​తో మ్యాచ్​లో భువీ ఆడేటప్పుడు నేను, నా ఫ్రెండ్స్​ హోటల్​ రూమ్​లో ఉన్నాం. భువీ నాకు తెలుసని నా స్నేహితులకు తెలియదు. అయితే అతడి బౌలింగ్​ నచ్చి అందరూ తన కోసం మాట్లాడుకునేవారు. అందరూ ఆ 15వ నంబర్​ టీ షర్ట్​ వేసుకున్న కుర్రాడు భలే బౌలింగ్​ చేస్తున్నాడని పొగుడుతుంటే ఉప్పొంగిపోయేదాన్ని. అంతేకాదు భువీకి బాగానే డిమాండ్​ ఉందని అప్పుడు అర్థమైంది"

భువనేశ్వర్​ కుమార్​, నుపుర్​ పెళ్లిఫొటో

తనకు 13 ఏళ్ల వయసున్నప్పుడు నుపుర్​ను చూసి ప్రేమలో పడినట్లు చెప్పాడు భువీ. ఆ తర్వాత ఆ ఇష్టం స్నేహంగా మారి చివరికి 2017, నవంబర్​ 26న పెళ్లి చేసుకునేవరకు వచ్చిందన్నాడు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.