కరోనా లాక్‌డౌన్ కారణంగా స్పాన్సర్‌షిప్‌లు వచ్చే పరిస్థితి లేదని.. క్రీడా కార్యకలాపాల పునరుద్ధరణకు చేయూత అందించాలని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) కోరింది. జాతీయ క్రీడా సమాఖ్యలకు, రాష్ట్ర ఒలింపిక్ సంఘాలకు రూ.200 కోట్లు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేసింది.
ఐఓఏకు రూ.10 కోట్లు, ఒలింపిక్ క్రీడా సమాఖ్యలకు రూ.5 కోట్లు చొప్పున, ఒలింపికేతర క్రీడా సమాఖ్యలకు రూ.2.5 కోట్లు చొప్పున, రాష్ట్ర ఒలింపిక్ సంఘాలకు రూ.1 కోటి చొప్పున కేటాయించాలని కోరుతూ క్రీడల మంత్రి కిరణ్ రిజిజుకు ఐఓఏ అధ్యక్షుడు నరిందర్ బాత్రాకు లేఖ రాశారు.
ఇదీ చూడండి.. వచ్చే నెల నుంచి దేశవాళీ టోర్నీలు ప్రారంభం!