భారత ప్రముఖ క్రికెటర్ రోహిత్ శర్మకు ఫుట్‌బాల్ అంటే చాలా ఇష్టం. తన ఫేవరెట్ జట్టు రియల్ మాడ్రిడ్ అని ఇంతకు ముందే చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు ఆ జట్టు సొంతమైదానం సాంటిగో బెర్నబూను, తన భార్య రితికతో కలిసి సందర్శించాడు. అక్కడ తీసుకున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. తన జీవితంలో చేయాలనుకున్న కొన్ని పనుల్లో ఒకటి ఈ రాత్రి తీరిపోయిందని ఫొటోను పోస్టు చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
జెర్సీ అందజేసిన లా లిగా
'లా లిగా' ఫుట్‌బాల్ లీగ్‌లోని రియల్ మాడ్రిడ్.. తమ జెర్సీని టీమిండియా వైస్‌కెప్టెన్ రోహిత్ శర్మకు అందించి గౌరవించింది. రియల్ మాడ్రిడ్-బార్సిలోనా మ్యాచ్‌ను వీక్షించడానికి హిట్‌మ్యాన్ కుటుంబ సమేతంగా స్పెయిన్‌కు వెళ్లాడు. ఈ మ్యాచ్‌లో రియల్ మాడ్రిడ్ 2-0తో విజయం సాధించింది. అనంతరం 'రో' అనే పేరుతో 45 నంబర్ ఉన్న జెర్సీని రియల్ మాడ్రిడ్ జట్టు రోహిత్‌కు ఇచ్చింది. టీమిండియా జెర్సీపై కూడా రోహిత్‌ది 45వ సంఖ్యే కావడం విశేషం.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
హిట్‌మ్యాన్‌కు జెర్సీ ఇస్తున్న ఫొటోను రియల్ మాడ్రిడ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. "రోహిత్‌శర్మ బెర్నబూకి రావడం గొప్పగా ఉంది" అనే వ్యాఖ్య జోడించింది. రోహిత్‌శర్మ.. తన ఇన్‌స్టాలో ఆ ఫొటోను పోస్ట్ చేశాడు. స్వాగతం పలికిన రియల్ మాడ్రిడ్‌కు ధన్యవాదాలు చెప్పాడు. మాడ్రిడ్ నగరాన్ని సందర్శించడానికి సహాయం చేసినందుకు లా లిగా నిర్వాహకులు, రియల్ మాడ్రిడ్ జట్టుకు రోహిత్ కృతజ్ఞతలు చెప్పాడు.
సఫారీ సిరీస్‌కు అందుబాటు
న్యూజిలాండ్ పర్యటనలో రోహిత్‌కు గాయం కావడం వల్ల వన్డే, టెస్టు సిరీస్‌లకు దూరమయ్యాడు. ఇతడు లేకపోవడం భారత్‌కు ప్రతికూలాంశంగా మారింది. కివీస్ చేతిలో టీమిండియా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. అయితే రోహిత్ లేకపోవడమూ ఓటమికి ఓ కారణమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెల 12 నుంచి మొదలవనున్న దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు హిట్‌మ్యాన్ అందుబాటులో రావొచ్చు. స్వదేశంలో సఫారీలతో భారత్ మూడు వన్డేలు ఆడనుంది.