ETV Bharat / sports

భారత క్రికెటర్‌ మహ్మద్​ సిరాజ్​కు పితృవియోగం

భారత యువ పేసర్​, తెలుగుతేజం మహ్మద్​ సిరాజ్​కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి మహ్మద్​ గౌజ్​ ఇవాళ తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా గౌజ్​ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

siraj
క్రికెటర్‌ సిరాజ్‌ తండ్రి కన్నుమూత
author img

By

Published : Nov 20, 2020, 7:28 PM IST

టీమ్​ఇండియా పేసర్‌ మహ్మద్ సిరాజ్‌ తండ్రి మహ్మద్ గౌజ్‌ మరణించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం కన్నుమూశారు. ఆస్ట్రేలియాలో ప్రాక్టీస్‌ సెషన్‌ ముగిసిన అనంతరం ఈ విషయాన్ని తెలుసుకున్న హైదరాబాద్‌ పేసర్‌ సిరాజ్‌ శోకసంద్రంలో మునిగిపోయాడు. ప్రస్తుతం ఆసీస్​లో బయోబబుల్‌లో ఉండటం వల్ల అతడు అంత్యక్రియలకు దూరం కానున్నాడు. ఐపీఎల్‌లో సత్తాచాటి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు సిరాజ్‌ ఎంపికైన సంగతి తెలిసిందే.

Mohammed Siraj Father mohammed ghouse
తండ్రి మహ్మద్​ గౌజ్​తో సిరాజ్​

కాగా, పేద కుటుంబంలో పుట్టిన సిరాజ్‌ భారత క్రికెటర్‌గా ఎదగడంలో తన తండ్రి కీలకపాత్ర పోషించాడు. ఆటో డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషిస్తూ సిరాజ్‌ కలను ప్రోత్సహించాడు. ఐపీఎల్‌లో హైదరాబాద్‌ జట్టు రూ.2.6 కోట్లకు సొంతం చేసుకోవడం వల్ల సిరాజ్‌ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత భారత్-ఎ జట్టులో చోటు దక్కించుకున్న అతడు నిలకడైన ప్రదర్శనతో టీమ్​ఇండియాకు ఎంపికయ్యాడు.

ఈ ఏడాది ఐపీఎల్​లో కోల్‌కతాతో జరిగిన ఓ మ్యాచ్‌లో బెంగళూరు తరఫున సిరాజ్‌ సంచలన ప్రదర్శన చేశాడు.‌ లీగ్‌లోని ఓ మ్యాచ్‌లో రెండు మెయిడిన్‌ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేగాక, ఒక్కపరుగు ఇవ్వకుండా మూడు వికెట్లు తీసిన బౌలర్‌గానూ చరిత్రకెక్కాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.