దిల్లీ క్యాపిటల్స్ జట్టులోని భారత బ్యాట్స్‌మెన్ రాణించాలని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కప్పు కొట్టాలంటే అది తప్పనిసరని తెలిపాడు.
ఈ మధ్య ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో పాల్గొన్నాడీ బ్యాట్స్‌మెన్. దిల్లీ జట్టుతో కలిసి ఆదివారం జరిగిన ప్రాక్టీస్‌లో సెషన్లో కాసేపు బ్యాటింగ్ చేశాడు.
"ఐపీఎల్లో సమతూకంతో ఉన్న జట్టుకే విజయావకాశాలు ఎక్కువ. ఈ ఏడాది మా జట్టులో స్పిన్నర్స్, ఆల్‌రౌండర్స్, బ్యాట్స్‌మెన్ ఇలా అన్ని విభాగాలు మెరుగ్గా ఉన్నాయి. జట్టులో టాప్ 5లో ఆడేవారందరూ భారత బ్యాట్స్‌మెన్ కావడం కలిసొచ్చే అంశం. దిల్లీ జట్టుకు ఆడేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచుస్తున్నాను. 10 సీజన్ల తర్వాత సొంత జట్టుకు ఆడటం ఓ ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తోంది."
-ధావన్, దిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్
దిల్లీ జట్టుకు ఆడకముందు గత పది సీజన్లలో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించాడీ లెఫ్ట్ హాండ్ బ్యాట్స్‌మెన్.