వెస్టిండీస్‌తో రెండో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వన్డే వర్షార్పణమైనందున ఈ మ్యాచ్‌లో గెలిచి బోణి కొట్టాలని ఇరుజట్లు చూస్తున్నాయి. మొదటి వన్డేకు ప్రకటించిన జట్లే ఈ రోజు బరిలోకి దిగనున్నాయి.
టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసిన కోహ్లీసేన.. అదే ఊపును వన్డేల్లోనూ కొనసాగించాలి భావిస్తోంది. వరుణుడి అడ్డంకి లేకపోతే మ్యాచ్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు.
జట్లు
వెస్టిండీస్: క్రిస్ గేల్, షై హోప్, ఎవిన్ లూయిస్, హెట్మయిర్, నికోలస్ పూరన్, హోల్డర్(కెప్టెన్), రోస్టన్ ఛేజ్, ఒషేనో థామస్, బ్రాత్‌వైట్, కాట్రెల్, కీమర్ రోచ్
టీమిండియా: శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఖలీల్ అహ్మద్