మెగా టోర్నీ అనంతరం.. భారత్ బరిలోకి దిగిన తొలి సిరీస్‌లో జయకేతనం ఎగురవేసింది. వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ-20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే.. కైవసం చేసుకుంది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితాన్ని తేల్చారు. టీమిండియా... 22 పరుగుల తేడాతో గెలిచినట్లుగా ప్రకటించారు. ఆల్‌రౌండ్ ప్రతిభ కనబర్చిన కృనాల్ పాండ్యకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్‌లో చివరిదైన మూడో టీ-20 ఆగస్టు 6(మంగళవారం) జరగనుంది. అనంతరం.. వన్డే సిరీస్ ఆగస్టు 8 నుంచి ప్రారంభం కానుంది.
రాణించిన రోహిత్..
మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్(67), ధావన్(23) తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించారు. అనంతరం.. సారథి కోహ్లీ(28), పాండ్య(20*) రాణించగా.. విండీస్ ముందు 168 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది.
బౌలింగ్‌లో సమష్టిగా...
భారీ హిట్టర్లున్న విండీస్‌ను ఏ దశలోనూ విజయం దిశగా సాగనివ్వలేదు భారత బౌలర్లు. ఆరంభంలోనే వికెట్లు తీసి.. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. ఓపెనర్లు లూయిస్(0), నరైన్(4) వెంటనే పెవిలియన్ చేరారు. పావెల్(54) అర్ధసెంచరీతో రాణించగా... పూరన్(19) ఓ మోస్తరుగా ఆడాడు. దూకుడు పెంచుతున్న సమయంలో వీరిద్దరినీ అవుట్ చేసి.. భారత్‌కు దాదాపు గెలుపు ఖాయం చేశాడు కృనాల్ పాండ్య.
-
India beat West Indies by 22 runs in a rain-affected T20I!
— ICC (@ICC) August 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Krunal Pandya finished with excellent figures of 2/23 off his 3.3 overs.#WIvIND pic.twitter.com/buizhDBNnQ
">India beat West Indies by 22 runs in a rain-affected T20I!
— ICC (@ICC) August 4, 2019
Krunal Pandya finished with excellent figures of 2/23 off his 3.3 overs.#WIvIND pic.twitter.com/buizhDBNnQIndia beat West Indies by 22 runs in a rain-affected T20I!
— ICC (@ICC) August 4, 2019
Krunal Pandya finished with excellent figures of 2/23 off his 3.3 overs.#WIvIND pic.twitter.com/buizhDBNnQ
15.3 ఓవర్లకు విండీస్ 98/4తో ఉన్న సమయంలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. పొలార్డ్(8), హెట్మయర్(6) క్రీజులో ఉన్నారు. అప్పటికీ విజయం సాధించాలంటే వెస్టిండీస్ జట్టు.. 27 బంతుల్లో 70 పరుగులు చేయాలి. అనంతరం.. మ్యాచ్ జరిగే అవకాశం లేనందున డక్‌వర్త్ లూయిస పద్ధతిలో భారత్ 22 పరుగుల తేడాతో గెలిచినట్లుగా ఫలితం ప్రకటించారు.
పాండ్య 2 వికెట్లు తీయగా.. భువీ, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీశారు.
హిట్‌మ్యాన్ సిక్సర్ల రికార్డు...
-
Rohit Sharma has now hit the most sixes in T20Is 🔥👏 pic.twitter.com/jnYyfFVfFR
— ICC (@ICC) August 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Rohit Sharma has now hit the most sixes in T20Is 🔥👏 pic.twitter.com/jnYyfFVfFR
— ICC (@ICC) August 4, 2019Rohit Sharma has now hit the most sixes in T20Is 🔥👏 pic.twitter.com/jnYyfFVfFR
— ICC (@ICC) August 4, 2019
ఈ మ్యాచ్‌లో 3 సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్, భారత ఓపెనర్ రోహిత్ శర్మ.. ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ టీ-20ల్లో అత్యధిక సిక్సర్లు(107) సాధించి.. క్రిస్‌గేల్(105) రికార్డును అధిగమించాడు. కివీస్ ఆటగాడు గప్తిల్(103) సిక్సులతో మూడో స్థానంలో ఉన్నాడు.