ETV Bharat / sports

దంచేసిన ఇషాన్​- కోహ్లీ... భారత్​దే గెలుపు

author img

By

Published : Mar 14, 2021, 10:33 PM IST

Updated : Mar 15, 2021, 9:13 AM IST

అరంగేట్ర మ్యాచ్​లో ఇషాన్​ కిషన్​ దంచికొట్టగా.. కోహ్లీ కెప్టెన్​ ఇన్నింగ్స్​ ఆడగా.. పంత్​ విజృంభించగా... ఇంగ్లాండ్​తో జరిగిన రెండో టీ20లో టీమ్​ ఇండియా ఘన విజయం సాధించింది. అరంగేట్రంలోనే అర్థశతకం సాధించిన ఇషాన్​కు మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ వరించింది.

2nd t20 win
2nd t20 winదంచేసిన ఇషాన్​- కోహ్లీ... భారత్​దే గెలుపు

ఇషాన్​ కిషన్​ మెరుపులు, విరాట్​ కోహ్లీ కెప్టెన్​ ఇన్నింగ్స్​తో.. అహ్మదాబాద్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న రెండో టీ20లో టీమ్​ఇండియా ఘన విజయం సాధించింది. లక్ష్యాన్ని మరో 13 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. అరంగేట్రంలోనే అర్థశతకం(56) సాధించిన ఇషాన్​కు మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ వరించింది.

2nd t20 win
అర్ధ సెంచరీలతో రాణించిన కోహ్లీ, కిషన్

ఇషాన్​- కోహ్లీ 'షో'

165 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమ్​ఇండియాకు తొలి ఓవర్​లోనే ఎదురుదెబ్బ తగిలింది. సామ్​ కరన్​ వేసిన తొలి ఓవర్లే.. కీపర్​ బట్లర్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు ఓపెనర్​ కేఎల్​ రాహుల్​(0). అప్పటికి భారత్​ కూడా ఇంకా ఖాతా తెరవలేదు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ(73*)తో ఇషాన్​ కిషన్ అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అడుతున్నది తొలి మ్యాచ్​ అన్న భయమే లేకుండా.. స్వేచ్ఛగా షాట్లు ఆడి.. ఇంగ్లాండ్​ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు.

ఈ మ్యాచ్​తో కోహ్లీ కూడా ఫామ్​ అందుకున్నాడు. చక్కటి డ్రైవ్స్​తో అభిమానులను అలరించాడు. ముఖ్యంగా.. కళ్లు చెదిరే స్ట్రైయిట్​ డ్రైవ్​ సిక్స్​తో అర్థశతకాన్ని అందుకున్న తీరు అద్భుతం. ఆ తర్వాత కోహ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. వరుస ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి పనిని ముగించాడు.

56 పరుగులు చేసిన ఇషాన్​.. అదిల్​ రషీద్​ బౌలింగ్​లో ఎల్​బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్​ పంత్​ కూడా ఎక్కడా ఆగలేదు. ఇంగ్లాండ్​ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కానీ జోరును కొనసాగించలేక.. 26(13బంతులు) పరుగుల వద్ద జార్డన్​ బౌలింగ్​లో వెనుదిరిగాడు.

ఆ తర్వాత వచ్చిన శ్రేయస్​ అయ్యర్​తో కలిసి కోహ్లీ... భారత్​కు విజయాన్ని అందించాడు.

అంతకు ముందు.. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన మోర్గాన్​ సేన.. నిర్ణీత 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. జేసన్​ రాయ్​ టాప్​ స్కోరర్​గా నిలిచాడు.

ఈ విజయంతో 5 మ్యాచ్​ల టీ20 సిరీస్​ను 1-1తో భారత్​ సమం చేసింది.

ఇదీ చూడండి: చరిత్ర సృష్టించిన 'ఫెన్సర్'​ భవానీ- ఒలింపిక్స్​కు అర్హత​

Last Updated : Mar 15, 2021, 9:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.