హైదరాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన కోహ్లీసేన.. బౌలింగ్ ఎంచుకుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో భారత్ క్రికెటర్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారనేది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా ఓపెనర్‌గా రానున్న రాహుల్, వికెట్ కీపర్ పంత్‌పైనే అందరి దృష్టి నెలకొంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌లో బోణీ కొట్టాలని ఇరుజట్లు భావిస్తున్నాయి.
జట్లు
భారత్: కోహ్లీ(కెప్టెన్), రోహిత్, రాహుల్, శ్రేయస్ అయ్యర్, పంత్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యజ్వేంద్ర చాహల్
వెస్టిండీస్: సిమన్స్, లూయిస్, బ్రాండన్ కింగ్, హెట్మయిర్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), దినేశ్ రామ్‌దిన్, జేసన్ హోల్డర్, హేడెన్ వాల్ష్, షెల్డన్ కాట్రెల్, కీస్రక్ విలియమ్స్, కారీ పియర్రే