గత రెండేళ్లుగా వన్డేల్లో టాప్ స్కోరర్‌గా నిలుస్తున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఇప్పుడతడికి రోహిత్ శర్మ పోటీ ఇస్తున్నాడు. ఇద్దరి మధ్య పరుగుల అంతరం తక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో ఎక్కువ పరుగులు చేసి, ఏడాదిని ముగించాలని ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ భావిస్తున్నారు. మరి ఈ రికార్డు ఎవరు సాధిస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ ఏడాది 23 వన్డేలాడిన కోహ్లీ 64.40 సగటుతో 1288 పరుగులు చేశాడు. 25 మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ 53.56 సగటుతో 1232 పరుగులు సాధించాడు. ఇద్దరి మధ్య పరుగుల అంతరం 56 పరుగులు మాత్రమే.
2019లో ఎక్కువ పరుగులు చేసిన టాప్-5 వన్డే బ్యాట్స్‌మెన్..
- విరాట్ కోహ్లీ: 23 మ్యాచ్‌లు, 1288 పరుగులు, సగటు 64.40
- రోహిత్ శర్మ: 25 మ్యాచ్‌లు, 1232 పరుగులు, సగటు 53.56
- ఆరోన్ ఫించ్: 23 మ్యాచ్‌లు, 1141 పరుగులు, సగటు 51.86
- షాయ్ హోప్: 25 మ్యాచ్‌లు, 1123 పరుగులు, సగటు 56.15
- బాబర్ అజాం: 20 మ్యాచ్‌లు, 1092 పరుగులు, సగటు 60.66
విండీస్‌పై సత్తాచాటితే కోహ్లీ ప్రపంచ రికార్డు..
2019లో అత్యధిక పరుగులతో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న విరాట్.. ఇదే జోరు కొనసాగిస్తే వరుసగా మూడేళ్లు, ఎక్కువ పరుగులు సాధించిన వన్డే బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఇంతవరకు ఈ ఘనత ఎవరూ దక్కించుకోలేదు. విరాట్.. వన్డేల్లో మూడు సార్లు ఎక్కువ పరుగులు సాధించి, ఏడాది ముగించినప్పటికీ వరుసగా అయితే చేయలేదు.
![India vs West Indies: Rohit Sharma threat looms large as Virat Kohli eyes massive world record](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kohli_0712newsroom_1575719482_184.jpeg)
క్యాలెండర్ ఇయర్లలో అత్యధిక పరుగులు చేసిన వన్డే బ్యాట్స్‌మెన్
- విరాట్ కోహ్లీ(భారత్) - 2011, 2017, 2018
- డెస్మండ్ హెయన్స్(వెస్టిండీస్) - 1984, 1985, 1989
- సౌరభ్ గంగూలీ(భారత్) - 1997, 1999, 2000
- కుమార సంగక్కర(శ్రీలంక) - 2006, 2012, 2014
మూడు ఫార్మాట్లలో కలిపి కోహ్లీ ఈ ఏడాది 2366 పరుగులు చేశాడు. ప్రస్తుతం లీడింగ్ రన్ స్కోరర్‌గా ఉన్న విరాట్ తర్వాత స్థానంలో రోహిత్ శర్మ(2184) ఉన్నాడు. అనంతరం బాబర్ అజాం(1820) మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాదిలో ఇంకా మూడు వన్డేలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో విరాట్, రోహిత్ ఇద్దరిలో ఎవరూ టాప్‌లో నిలుస్తారనే విషయమై ఆసక్తి నెలకొంది.
![India vs West Indies: Rohit Sharma threat looms large as Virat Kohli eyes massive world record](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/vk-and-rohit_1312newsroom_1576213712_735.jpg)
2016 నుంచి మూడు ఫార్మాట్లలో లీడింగ్ స్కోరర్‌గా కోహ్లీ ముగిస్తున్నాడు. ఆ ఏడాది 2595 పరుగులు చేసిన కోహ్లీ తర్వాతి సంవత్సరం 2818, అనంతరం 2735 పరుగులతో హ్యాట్రిక్ సాధించాడు. ఇప్పుడు నాలుగో ఏడాది, అదే జోరు కోనసాగించినప్పటికీ.. రోహిత్ శర్మ అడ్డుగా ఉన్నాడు. ఇప్పటికే టీ20ల్లో ఇద్దరి స్కోర్లు సమంగా ఉన్న నేపథ్యంలో వన్డేల్లోనూ ఆ ఘనత సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాడు హిట్ మ్యాన్.
ఇదీ చదవండి: 'నేనూ ధోనీ అభిమానినే.. రిటైర్మెంట్పై మహీనే మాట్లాడాలి'