ETV Bharat / sports

కరోనా దెబ్బతో భారత్​-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్​ రద్దు - india-vs-south-africa-odi-series-called-off-due-to-corona-outbreak

india vs south africa odi series called off due to corona outbreak
కరోనా దెబ్బతో భారత్​-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్​ రద్దు
author img

By

Published : Mar 13, 2020, 5:54 PM IST

Updated : Mar 13, 2020, 6:29 PM IST

17:49 March 13

భారత్-దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్‌ రద్దయింది. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది బీసీసీఐ. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మార్చి 12న ధర్మశాలలో తొలి వన్డే జరగాల్సి ఉండగా.. వర్షం కారణంగా ఒక్క బంతీ పడకుండానే రద్దు చేశారు. ఈ నెల 15న లఖ్​నవూలో రెండో వన్డే, 18న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో చివరి వన్డే జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్​లు అభిమానులు లేకుండా నిర్వహించాలని అనుకున్నారు. కానీ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మొత్తం సిరీస్‌ను రద్దు చేశారు.

కోవిడ్-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కొన్ని క్రీడా టోర్నీలు వాయిదా పడ్డాయి. తాజాగా ఈ నెలలో ప్రారంభం కావాల్సిన ఐపీఎల్‌ను కూడా బీసీసీఐ వాయిదా వేసింది.

వీటికీ సెగ తగిలింది..

కరోనా సెగ పాకిస్థాన్​ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)కు కొంచెం తగిలింది. వైరస్​కు భయపడి ఆ టోర్నీ నుంచి ఇంగ్లండ్‌ ఆటగాళ్లు స్వదేశానికి పయనమయ్యారు. కొందరు క్రికెటర్లు వెళ్లిపోయినా లీగ్‌ మాత్రం యధాతథంగా కొనసాగుతుందని పీఎస్‌ఎల్‌ యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే కరోనా వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించడం వల్ల ఇక మీదట ఏ మ్యాచ్​ అయినా ప్రేక్షకులు లేకుండానే జరగనున్నాయి. శ్రీలంక-ఇంగ్లాండ్​ మధ్య రెండు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ కూడా తాజాగా రద్దయింది.

Last Updated : Mar 13, 2020, 6:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.