ETV Bharat / sports

టీమిండియాతో తలపడే న్యూజిలాండ్ టెస్టు జట్టిదే - భారత్ న్యూజిలాండ్​ టెస్టు సిరీస్​కు బౌల్ట్ ఎంపిక

టీమిండియాతో ఈనెల 21న ప్రారంభమయ్యే టెస్టు సిరీస్​ కోసం జట్టును ప్రకటించారు న్యూజిలాండ్ సెలక్టర్లు. గాయం నుంచి కోలుకున్న పేసర్ ట్రెంట్ బౌల్ట్ తుది జట్టులో స్థానం సంపాదించాడు.

NZ
NZ
author img

By

Published : Feb 17, 2020, 4:17 PM IST

Updated : Mar 1, 2020, 3:11 PM IST

భారత్​తో జరగబోయే టెస్టు సిరీస్​ కోసం జట్టును ప్రకటించింది న్యూజిలాండ్ సెలక్షన్ కమిటీ. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన కివీస్ ప్రధాన పేసర్ ట్రెంట్ బౌల్ట్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఆగస్టులో శ్రీలంకతో టెస్టు సిరీస్ సందర్భంగా దూరమైన స్పిన్నర్ అజాజ్ పటేల్​కు చోటు కల్పించారు సెలక్టర్లు. ఇటీవల భారత్​తో జరిగిన వన్డే సిరీస్​లో సత్తాచాటిన కైల్ జేమిసన్​ స్థానం సంపాదించాడు.

ఆస్ట్రేలియా సిరీస్‌ సందర్భంగా మెల్‌బోర్న్‌ టెస్టులో శతకంతో కదంతొక్కిన వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మన్‌ టామ్‌ బ్లండెల్‌, అలాగే ఇంగ్లాండ్‌ పర్యటన సందర్భంగా టెస్టు అరంగేట్రంలో అదరగొట్టిన డారిల్‌ మిచెల్‌ కూడా స్థానం దక్కించుకున్నారు.

భారత్, న్యూజిలాండ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ఈనెల 21న ప్రారంభంకానుంది. ఇప్పటికే జరిగిన టీ20 సిరీస్​ను టీమిండియా క్లీన్ స్వీప్ చేయగా.. వన్డే సిరీస్​ను కివీస్ వైట్ వాష్ చేసింది.

న్యూజిలాండ్ జట్టు: కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), టామ్‌ బ్లండెల్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌, కైల్‌ జేమీసన్‌, టామ్‌ లాథమ్‌, డారిల్‌ మిచెల్‌, హెన్రీ నికోల్స్‌, అజాజ్‌ పటేల్‌, టిమ్‌ సౌథీ, రాస్‌టేలర్‌, నీల్‌ వాగ్నర్‌, బీజే వాట్లింగ్‌.

Last Updated : Mar 1, 2020, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.