ETV Bharat / sports

'భారత్​ను దెబ్బతీయడం ఇంగ్లాండ్​కు కష్టమే.. కానీ' - టీమ్​ఇండియాతో ఇంగ్లాండ్​కు కష్టం ఆండీ ఫ్లవర్​

టెస్టు సిరీస్​లో టీమ్​ఇండియాను దెబ్బతీయడం ఇంగ్లాండ్​కు కష్టమని అభిప్రాయపడ్డాడు జింబాబ్వే మాజీ క్రికెటర్​ ఆండీ ఫ్లవర్​. అయితే ఇంగ్లీష్​ జట్టు సారథి జో రూట్​, బట్లర్‌, బెన్‌స్టోక్స్‌ లాంటి ఆటగాళ్లు సమయోచితంగా బ్యాటింగ్‌ చేస్తూ భారీ పరుగులు చేస్తేనే భారత జట్టుపై ఒత్తిడి తీసుకురావచ్చు అని చెప్పాడు.

england
ఇంగ్లాండ్​
author img

By

Published : Jan 28, 2021, 11:46 AM IST

రాబోయే టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌ జట్టు టీమ్‌ఇండియాను ఓడించడం అంత తేలిక కాదని జింబాబ్వే మాజీ ఆటగాడు, ఇంగ్లాండ్‌ మాజీ కోచ్‌ ఆండీ ఫ్లవర్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా అతడు మీడియాతో మాట్లాడుతూ ఈ వాఖ్యలు చేశాడు. 2012లో అలిస్టర్‌ కుక్‌ నేతృత్వంలో ఇంగ్లాండ్‌ జట్టు.. భారత్‌లో 2-1 తేడాతో టెస్టు సిరీస్‌ కైవసం చేసుకుంది. ఆ సమయంలో ఫ్లవర్‌ ఇంగ్లాండ్‌కు కోచ్‌గా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలోనే తాజా సిరీస్‌పై స్పందిస్తూ.. నాటి జట్టు కంటే ప్రస్తుత ఇంగ్లాండ్‌ జట్టుకు భారత్‌ను ఓడించడం కష్టమని పేర్కొన్నాడు.

"భారత్‌తో టెస్టు సిరీస్‌ క్లిష్టమైన సవాళ్లతో కూడుకున్నది. అప్పటి మా జట్టు కన్నా ఇప్పటి ఇంగ్లాండ్‌ జట్టుకు అది ఇంకా కష్టం. ఆస్ట్రేలియాపై విజయం సాధించాక టీమ్‌ ఇండియా మరింత ఆత్మవిశ్వాసంతో ఉంది. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లోనూ చాలా బలంగా కనిపిస్తోంది. అయితే, మేం భారత్‌లో పర్యటించినప్పుడు కుక్‌ ఎలా ఆడాడో ఇప్పుడు జోరూట్‌ కూడా అలాగే ఆడాలి. సమయోచితంగా బ్యాటింగ్‌ చేస్తూ భారీ పరుగులు చేయాలి. తర్వాత బట్లర్‌, బెన్‌స్టోక్స్‌ లాంటి ఆటగాళ్లు కావాలి. వారు పీటర్సన్‌లా ఆడాలి. ఈ ముగ్గురూ చెలరేగి టీమ్‌ఇండియాపై ఒత్తిడి తీసుకురావాలి" అని ఫ్లవర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

కాగా, 2012లో కుక్‌, పీటర్సన్‌ ఇంగ్లాండ్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. వారిద్దరూ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని భారీగా పరుగులు చేశారు. మరోవైపు ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు బుధవారమే చెన్నై చేరుకున్నారు. ప్రస్తుతం ఆరు రోజుల క్వారంటైన్‌లో ఉన్నారు. టీమ్‌ఇండియా ఆటగాళ్లు సైతం క్వారంటైన్‌లోనే ఉన్నారు. ఇక వచ్చేనెల ఐదు నుంచి ఇరు జట్లూ చెన్నైలోనే తొలి టెస్టు, 13 నుంచి రెండో టెస్టు ఆడనున్నారు. ఆపై 24 నుంచి మూడో టెస్టు, మార్చి 4 నుంచి నాలుగో టెస్టు అహ్మదాబాద్‌లో ఆడనున్నారు.

ఇదీ చూడండి : 'భారత్​తో సిరీస్​ కఠిన సవాల్​ లాంటిది.. కానీ​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.