ETV Bharat / sports

అశ్విన్ మాయాజాలం.. ఆధిక్యంలో భారత్ - india vs australia test

తొలి టెస్టులో టీమ్​ఇండియా 62 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్​లో ఆచితూచి ఆడుతోంది. ఆతిథ్య ఆసీస్​ను తొలి ఇన్నింగ్స్​లో 191 పరుగులకే ఆలౌట్ చేసింది.

.
.
author img

By

Published : Dec 18, 2020, 5:21 PM IST

అడిలైడ్​లో జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా డే/నైట్‌ టెస్టు రెండో రోజు ముగిసింది. 233/6తో రెండో రోజు బ్యాటింగ్​కు దిగిన భారత్..​ తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌట్​ అయింది. అనంతరం ఆస్ట్రేలియాను 191 పరుగులకే కట్టడి చేసింది. అశ్విన్‌ (4/55), ఉమేశ్ యాదవ్ (3/40), బుమ్రా (2/52) కంగారూ జట్టును బెంబేలెత్తించారు.

ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్ పైన్ (73*) ఒంటరి పోరాటం చేశాడు. లబుషేన్‌ (47) రాణించాడు. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 53 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్​ ప్రారంభించిన కోహ్లీసేన.. 6 ఓవర్లు ఆడి వికెట్​ నష్టానికి 9 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ అగర్వాల్ (5), బుమ్రా (0) ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.