ETV Bharat / sports

భారత్​ లక్ష్యం  237 - crikcket

ఆసీస్ జట్టు ఖాతా తెరవకముందే రెండో ఓవర్లో ఫించ్​ని స్లిప్​లో దొరకబట్టేశాడు బుమ్రా. కుల్దీప్, మహమ్మద్​ షమీ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

భారత్
author img

By

Published : Mar 2, 2019, 5:08 PM IST

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేలో కంగారూలు7 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో కోహ్లీ సేన బౌలింగ్​తో ఆకట్టుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగారూ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు ఖాతా తెరవకముందే రెండో ఓవర్లో ఫించ్​ని స్లిప్​లో దొరకబట్టేశాడు బుమ్రా. ఉస్మాన్ క్వాజా అర్థశతకం చేయగా, మ్యాక్స్​వెల్(40) రాణించాడు.

అనంతరం స్టోయినీస్(37), ఉస్మాన్ క్వాజా(50) జంట నిలకడగా ఆడి స్కోరు బోర్డుని ముందుకు నెట్టింది. స్టోయినీస్​ని ఔట్ చేసిన కేదార్ జాదవ్.. 87 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన ఈ జంటను విడదీశాడు. కాసేపటికే కుల్దీప్ బౌలింగ్​లో విజయ్​శంకర్​కు క్యాచ్​ ఇచ్చి క్వాజా వెనుదిరిగాడు. చివర్లో అలెక్స్(36), నాథన్ కౌల్టర్​నైల్(28) వికెట్ పడకుండా జాగ్రత్త పడి గౌరవప్రద స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించారు.

కుల్దీప్, మహమ్మద్​ షమీ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. క్వాజా, హ్యాండ్స్​కోంబ్(19) వికెట్లు తీసి ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషించాడు కుల్దీప్. ప్రమాదకరంగా మారుతున్న మ్యాక్స్​వెల్, టర్నర్​ని బౌల్డ్​ చేసి భారత్ లక్ష్యాన్ని కుదించాడు. బుమ్రా కూడా ఫించ్, కౌల్టర్​ నైల్ ఔట్ చేసి రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.