రోడ్ సేఫ్టీ సిరీస్ టైటిల్ను ఇండియా లెజెండ్స్ గెల్చుకుంది. ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్ టీంపై.. సచిన్ సేన 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఇండియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ (41 బంతుల్లో 60 పరుగులు), యూసుఫ్ పఠాన్ (36 బంతుల్లో 62 పరుగులు) విధ్వంసానికి తోడు ఓపెనర్ సచిన్ (30) ఆకట్టుకునే ప్రదర్శన చేశారు.
అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక లెజెండ్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులే చేసింది. లంక జట్టులో సనత్ జయసూర్య (35 బంతుల్లో 43 పరుగులు), జయసింఘే (30 బంతుల్లో 40), వీరరత్నే (15 బంతుల్లో 38) రాణించారు. భారత బౌలర్లలో యూసుఫ్ పఠాన్ 2/26, ఇర్ఫాన్ పఠాన్ 2/29 పొదుపుగా బౌలింగ్ చేశారు. కీలక సమయంలో వికెట్లు తీశారు.
ఇదీ చదవండి: ఉత్కంఠ పోరులో ఆఖరి బంతికి దక్షిణాఫ్రికా విజయం