ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానున్న ఇండియా, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కు సంబంధించి టెలివిజన్ హక్కులను.. యూకేలో ఇంకా నిర్ణయించలేదు. సమయం దగ్గర పడుతున్న క్రమంలో టీవీ హక్కులపై ఉత్కంఠ నెలకొంది.
"సిరీస్ ఆతిథ్య బ్రాడ్‌కాస్టర్ అయిన స్టార్ ఇండియా ఈ పర్యటనను స్కై వంటి సంప్రదాయక బ్రాడ్‌కాస్ట్‌కు విక్రయించే బదులు.. తన స్ట్రీమింగ్ అప్లికేషన్ హాట్‌స్టార్‌లో ప్రసారం చేయాలని ఆలోచిస్తుంది. కానీ, ఆస్ట్రేలియా, భారత్ సిరీస్.. శ్రీలంక, ఇంగ్లాండ్ సిరీస్‌లో స్కై, ఛానల్ 4కు మంచి మార్కెట్ లభించింది" అని టెలిగ్రాఫ్ స్పోర్ట్ అనే నివేదిక తెలిపింది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్న ఈ సిరీసుకు రూ.200 కోట్ల విలువైన హక్కులు త్వరలోనే లభించే అవకాశం ఉంది. కొవిడ్ కారణంగా అధికంగా ప్రజలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న నేపథ్యంలో.. ఈ సిరీస్‌కు వీక్షకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా డే నైట్ మ్యాచ్ యూకేలో ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది.
గత మూడు దశాబ్దాలుగా ఇంగ్లాండ్‌కు సంబంధించి ప్రతి సిరీస్‌ను స్కై ఛానల్ బ్రాడ్కాస్ట్ చేసిందని నివేదిక పేర్కొంది.
కాగా, శ్రీలంక పర్యటన ముగించుకున్న ఇంగ్లాండ్ జట్టు నేరుగా చెన్నై చేరుకుంది. ఇరు జట్లు ఆరు రోజుల క్వారంటైన్లో ఉన్నాయి. ఈ పర్యటనలో పర్యాటక జట్టు నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తో పాటు 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది.
ఇదీ చదవండి: క్వారంటైన్ ముగిసే.. ఇక సందడే