ETV Bharat / sports

'క్రికెట్​ అనగానే నాకు గుర్తొచ్చేది అదే' - లాక్​డౌన్​ను 'విహారి' ఎలా ఆస్వాదిస్తున్నాడంటే?

లాక్‌డౌన్‌ సమయంలో ఫిట్‌నెస్‌ కాపాడుకునేందుకు ఎలాంటి కసరత్తులు చేస్తున్నాడు? మొదటి టెస్టు సెంచరీ జ్ఞాపకాలేంటి? తదితర విషయాలను పంచుకున్నాడు టీమిండియా క్రికెటర్​ హనుమ విహారి.

India cricketer Hanuma Vihari reveals his secret of fitness and his first century memories
లాక్​డౌన్​ను 'విహారి' ఎలా ఆస్వాదిస్తున్నాడంటే?
author img

By

Published : May 5, 2020, 8:58 AM IST

కరోనా టెస్టులో ప్రజలందరూ ఓపికగా ఆడి, వైరస్‌పై విజయం సాధించాలని టీమిండియా క్రికెటర్ హనుమ విహారి కోరుతున్నాడు. ఇన్నాళ్లుగా క్రికెట్‌ ప్రాక్టీస్‌, టూర్లు అంటూ ఖాళీ లేకుండా గడిపిన తాను.. అనుకోకుండా వచ్చిన ఈ విరామాన్ని ఆస్వాదిస్తున్నానని చెబుతున్నాడు. కరోనా తగ్గిన తర్వాత కిక్రెట్‌లోనూ చాలా మార్పులొస్తాయంటున్నాడు. ఆటగాళ్లు పూర్వపు ఫామ్​ను అందుకునేందుకు శ్రమించాల్సిందే అంటున్నాడు.

లాక్‌డౌన్‌ను ఎలా గడుపుతున్నారు? క్రికెట్‌కు సంబంధం లేకుండా ఇంట్లో కొత్త ప్రయోగాలేమైనా చేస్తున్నారా?

మ్యాచ్‌, టూర్స్‌ వల్ల ఎక్కువగా ఖాళీ సమయం ఉండేది కాదు. లాక్‌డౌన్‌తో ఎప్పుడూ లేనంతగా ఖాళీ సమయం దొరికింది. కుటుంబంతో ఇంత సమయం గడపడం ఇదే మొదటిసారి. ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టా. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నా. లాక్‌డౌన్‌ మొదటి రెండు వారాల పాటు బాగానే అనిపించింది. కానీ నెమ్మదిగా ఆటను మిస్‌ అవుతున్నట్లు అనిపిస్తోంది. ఇంట్లో కొత్త ప్రయోగాలేవి ఇప్పటి వరకు చేయలేదు. ఒకటి, రెండు సార్లు వంట చేశా అంతే. మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ పొడిగించారు కదా.. పనులు నేర్చుకుంటా.

మీరు తక్కువ టెస్టులే ఆడినప్పటికీ చాలా అనుభవాలున్నాయి. క్రికెట్ అనగానే వెంటనే మీకు గుర్తొచ్చే జ్ఞాపకమేది?

క్రికెట్ అనగానే గుర్తొచ్చేదంటే నా చిన్నతనం. ఎందుకంటే అప్పుడు మ్యాచ్​లు ఎక్కువగా చూసేవాడిని. అప్పుడే ఇష్టం పెరిగి ఆడాలని నిశ్చయించుకున్నా. ప్రస్తుతం అదే నా ప్రొఫెషన్‌ అయిపోయింది.

క్రికెట్‌లో ఎవరంటే ఇష్టం? చిన్నప్పుడు క్రికెట్‌లో ఎవరి స్టైల్‌ను అనుకరించేవారు?

మొదటి నుంచి సచిన్‌ తెందుల్కర్‌ అంటే అభిమానం. ఆయనను చూసే క్రికెట్‌పై ఇష్టం పెరిగింది. ఆటలో ఎవరి స్టైల్‌ కాపీ కొట్టేవాడిని కాదు. నాకంటూ ఓ ప్రత్యేక స్టైల్‌ ఉండాలనుకునే వాడిని.

ఇన్ని రోజుల విరామం తర్వాత తిరిగి ఆడాలంటే బ్యాట్స్‌మెన్‌కు ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా?

చిన్నప్పటి నుంచి క్రికెట్‌ ఆడుతూనే ఉన్నాం. చాలా శక్తినే కూడగట్టుకొని ఉంటామనుకుంటున్నా. కాకపోతే ఇన్నిరోజుల విరామం వల్ల ప్రారంభంలో కొత్త ఇబ్బందిగా ఉండొచ్చు.

కరోనా తర్వాత క్రికెట్‌లో ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుందంటారు?

కొద్దిరోజుల పాటు స్టేడియానికి వచ్చేందుకు ప్రజలు భయపడొచ్చు. కానీ వైరస్‌ పూర్తిగా నాశనమయ్యాక తిరిగి తప్పక వస్తారు. రావాలి కూడా. ఎందుకంటే క్రికెట్‌ను అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటేనే మరింత సంతోషంగా ఉంటుంది. దానికోసం కొంత సమయం పట్టొచ్చు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.