న్యూజిలాండ్ పర్యటనలో కోహ్లీసేన జోరు కొనసాగుతోంది. తొలి టీ20లో భారీ లక్ష్యాన్ని ఛేదించి సత్తాచాటిన భారత బ్యాట్స్‌మెన్ రెండో టీ20లోనూ అదే జోరు కొనసాగించారు. కివీస్ విధించిన 133 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్లలో ఛేదించారు.
ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. తొలి మ్యాచ్‌లో ఆకట్టుకోని ఈ స్టార్ బ్యాట్స్‌మన్ ఈ మ్యాచ్‌లోనూ 8 పరుగులకే వెనుదిరిగాడు. కోహ్లీ (11) కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. అనంతరం కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఆచితూచి ఆడుతూ పరుగులు సాధించారు. కొంతకాలంగా అద్భుత ఫామ్ చూపిస్తోన్న రాహుల్ మరోసారి ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్‌లో రెండో అర్ధసెంచరీని నమోదు చేసుకున్నాడు. తొలి టీ20లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన శ్రేయస్ ఈ మ్యాచ్‌లోనూ సత్తాచాటాడు. చివర్లో దాటిగా ఆడబోయి 44 పరుగుల వద్ద ఔటయ్యాడు. అప్పటికే టీమిండియా విజయం దాదాపు ఖరారైపోయింది. చివర్లో దూబే సిక్సుతో మ్యాచ్‌ను ముగించాడు. రాహుల్ 57 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా ఏడు వికెట్ల తేడాగో విజయభేరి మోగించింది టీమిండియా. ఐదు టీ20ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ రెెండు వికెట్లు సాధించగా.. ఇష్ సోధి ఒక వికెట్ దక్కించుకున్నాడు.
-
KL Rahul and Shreyas Iyer's explosive batting powers India to a seven-wicket win in the second T20I 💥
— ICC (@ICC) January 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
🇮🇳 now lead the series 2-0!#NZvIND pic.twitter.com/fQY3JgfXjp
">KL Rahul and Shreyas Iyer's explosive batting powers India to a seven-wicket win in the second T20I 💥
— ICC (@ICC) January 26, 2020
🇮🇳 now lead the series 2-0!#NZvIND pic.twitter.com/fQY3JgfXjpKL Rahul and Shreyas Iyer's explosive batting powers India to a seven-wicket win in the second T20I 💥
— ICC (@ICC) January 26, 2020
🇮🇳 now lead the series 2-0!#NZvIND pic.twitter.com/fQY3JgfXjp
తడబడిన కివీస్
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేసింది భారత్. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు గప్తిల్ 33, మున్రో 26 పరుగులు చేశారు. మిగతా వారిలో విలియమన్స్ 14, గ్రాండ్‌హోమ్ 3, టేలర్ 18, సీఫెట్ 33 పరుగులు సాధించారు.
భారత బౌలర్లలో జడేజా 2 వికెట్లు తీయగా, శివమ్ దూబే, శార్దుల్, బుమ్రా తలో వికెట్ పడగొట్టారు.