దిల్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై శిఖర్ ధావన్(41) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. బంగ్లా బౌలర్లలో అమినుల్ హసన్, షఫియిల్ ఇస్లాం చెరో రెండు వికెట్లు తీయగా.. ఆఫిఫ్ హొస్సేన్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
-
A pair of sixes in the final over, and 🇮🇳 finish with 148/6.
— ICC (@ICC) November 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Is it enough?#INDvBAN | FOLLOW 👇 https://t.co/qBFzQDJ3Bs pic.twitter.com/dLpHcbDusG
">A pair of sixes in the final over, and 🇮🇳 finish with 148/6.
— ICC (@ICC) November 3, 2019
Is it enough?#INDvBAN | FOLLOW 👇 https://t.co/qBFzQDJ3Bs pic.twitter.com/dLpHcbDusGA pair of sixes in the final over, and 🇮🇳 finish with 148/6.
— ICC (@ICC) November 3, 2019
Is it enough?#INDvBAN | FOLLOW 👇 https://t.co/qBFzQDJ3Bs pic.twitter.com/dLpHcbDusG
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆరంభంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ(9) వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే రెండు ఫోర్లు కొట్టి దూకుడుగా ఆడిన హిట్‌మ్యాన్ షఫియిల్ బౌలింగ్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్‌కొచ్చిన కే ఎల్ రాహుల్(15) కూడా క్రీజులో ఎక్కువసేపు నిలబడలేకపోయాడు.
36కే 2 వికెట్లు కోల్పోయిన టీమిండియాను ధావన్ - శ్రేయాస్ అయ్యర్ ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే శ్రేయస్‌ను(22) ఔట్ చేసి నిలకడగా ఆడుతున్న ఈ జోడీని విడదీశాడు బంగ్లా బౌలర్ అమినుల్. కాసేపటికే ధావన్ కూడా రనౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఒక్క పరుగుకే ఔటై నిరాశ పరిచాడు.
-
At the halfway mark, #TeamIndia are 69/2
— BCCI (@BCCI) November 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Live - https://t.co/7oEQDn0RdS #INDvBAN pic.twitter.com/Tt9Enn24be
">At the halfway mark, #TeamIndia are 69/2
— BCCI (@BCCI) November 3, 2019
Live - https://t.co/7oEQDn0RdS #INDvBAN pic.twitter.com/Tt9Enn24beAt the halfway mark, #TeamIndia are 69/2
— BCCI (@BCCI) November 3, 2019
Live - https://t.co/7oEQDn0RdS #INDvBAN pic.twitter.com/Tt9Enn24be
పదే పదే వికెట్లు కోల్పోవడం వల్ల టీమిండియా స్కోరు వేగం తగ్గింది. ధాటిగా ఆడడం ప్రారంభించిన పంత్(27) బౌండరీ లైన్లో నయీమ్‌కు క్యాచ్‌కు ఇచ్చి ఔటయ్యాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్(14, 2 సిక్సర్లు), కృనాల్ పాండ్య(15. ఫోర్, సిక్సర్) మెరుపులు మెరిపించి.. భారత్‌కు గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇదీ చదవండి: 9 పరుగులకే ఔటైనా... ధోనీ, కోహ్లీ రికార్డులు బ్రేక్