ETV Bharat / sports

భారత్​-బంగ్లా: చారిత్రక 1000వ టీ20లో గెలుపెవరిది..? - india,bangladesh,india vs bangladesh 2019/20 shivam dube,cricket news telugu

అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానం కైవసం చేసుకోవాలని ఆరాటపడుతున్న టీమిండియా ముందు.. ఓ సరికొత్త ఘనత వేచి చూస్తోంది. నేడు దిల్లీలోని అరుణ్​జైట్లీ స్టేడియంలో బంగ్లా-భారత్​ మధ్య తొలి టీ20 జరగనుంది. ఇది టీ20 చరిత్రలో 1000వ మ్యాచ్​ కావడం విశేెషం.

భారత్​-బంగ్లా: చారిత్రక 1000వ టీ20లో గెలుపెవరిది..?
author img

By

Published : Nov 3, 2019, 2:06 PM IST

దిల్లీ వేదికగా భారత్‌, బంగ్లా జట్ల మధ్య నేడు(ఆదివారం)తొలి టీ20 మ్యాచ్‌ జరగనుంది. వాయు కాలుష్యంతో కాస్త ఇబ్బందులు ఉన్నా... ఆటను కొనసాగించేందుకు ఇరుజట్లు సిద్ధమౌతున్నాయి. దిల్లీలోని కోట్లా మైదానాన్ని అరుణ్​జైట్లీ స్టేడియంగా మార్చాక తొలిసారి ఈ మ్యాచ్​ జరగనుంది.

రికార్డు విజయాలు...

ఇప్పటివరకు బంగ్లాపై ఆడిన 8 టీ20 మ్యాచ్​ల్లో అన్నింటా గెలుపొందింది భారత జట్టు. నేడు జరగనున్న మ్యాచ్​లోనూ విజయం సాధించి సిరీస్‌లో బోణీ కొట్టాలని చూస్తోంది. అంతేకాకుండా టీ20 ర్యాంకింగ్స్​లో అగ్రస్థానంలో ఉన్న పాకిస్థాన్‌ జట్టు రికార్డుకు మరింత చేరువకావాలని చూస్తోంది రోహిత్​సేన.

దాయాది దేశం 11-0 తేడాతో జింబాబ్వేపై అత్యధిక వరుస విజయాలు సాధించిన జట్టుగా తొలిస్థానంలో కొనసాగుతోంది. బంగ్లాపై ఎనిమిది విజయాలతో రెండో స్థానంలో నిలిచింది భారత్​. అయితే టీమిండియా వరుస విజయాలకు చెక్‌ పెట్టాలని బంగ్లా కూడా పట్టుదలగా ఉంది.

బంగ్లాదేశ్​ సీనియర్‌ క్రికెటర్లు షకిబ్‌ అల్‌ హసన్‌ రెండేళ్ల పాటు ఆటకు దూరం కాగా, తమీమ్‌ ఇక్బాల్‌ ఈ సిరీస్‌లో ఆడటం లేదు. ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు లేకపోవడం వల్ల ఆ జట్టు కాస్త బలహీనంగానే కనిపిస్తోంది. అయితే తొలి టీ20లో బంగ్లా జట్టు టీమిండియా లాంటి మేటి జట్టును ఎలా ఎదుర్కొంటుదనేది ఆసక్తిగా మారింది.

భారత జట్టు వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చింది. ముంబయి ఆల్‌రౌండర్‌ శివమ్ దూబే ఈ మ్యాచ్‌ ద్వారా అరంగేట్రం చేసే అవకాశముంది. అలాగే రిషభ్‌ పంత్‌ కూడా బరిలోకి దిగనున్నాడు. దిల్లీ పిచ్‌ స్పిన్‌ బౌలింగ్‌కు అనుకూలం. ఫలితంగా యుజువేంద్ర చాహల్‌ జట్టులోకి వచ్చాడు. ఇదిలా ఉండగా ఈ రోజు జరగబోయే మ్యాచ్‌ వెయ్యవ(1000) టీ20. ఈ చారిత్రక మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనేది మరింత ప్రత్యేకంగా మారింది.

స్టేడియం మరింత ప్రత్యేకం..

  • అరుణ్‌ జైట్లీ (ఫిరోజ్‌షా కోట్లా) స్టేడియంలో భారత్‌ ఒకే ఒక్క టీ20 ఆడింది. 2017 నవంబరు 1న న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 53 పరుగుల తేడాతో విజయం సాధించింది.
  • ఈ వేదికలో జరిగిన టీ20ల్లో తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 157. రెండో ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 143.
  • ఈ స్టేడియంలో 202 అత్యధిక స్కోరు. 2017లో న్యూజిలాండ్‌పై భారత్‌ సాధించింది.

బంగ్లాదేశ్‌-భారత్‌ మధ్య 8 టీ20లు జరిగాయి. అన్నింట్లోనూ టీమిండియాదే విజయం. అయితే రెండు జట్లూ ఇప్పటిదాకా ద్వైపాక్షిక సిరీస్‌లో ఒక్కసారీ తలపడలేదు. ఈరోజే తొలి మ్యాచ్‌ ఆడనున్నాయి.

ఇరు జట్లు(15 మంది బృందం)..

భారత జట్టు..

రోహిత్​శర్మ(కెప్టెన్​), శిఖర్​ ధావన్​, కేఎల్​ రాహుల్​, సంజూ శాంసన్​, శ్రేయస్​ అయ్యర్​, మనీష్​ పాండే, రిషభ్ పంత్​(కీపర్​), వాషింగ్టన్​ సుందర్​, కృనాల్​ పాండ్య, యుజువేంద్ర చాహల్​, రాహుల్​ చాహర్​, దీపక్​ చాహర్​, ఖలీల్​ అహ్మద్​, శివమ్​ దూబే​, శార్దుల్​ ఠాకుర్​

బంగ్లా జట్టు..

మహ్మదుల్లా(కెప్టెన్​), సౌమ్య సర్కార్​, మహ్మద్​ నయీమ్​, ఆఫిఫ్​ హొస్సేన్​, మొసదెక్​ హొస్సేన్​, అనిముల్​ ఇస్లాం, లిటన్​ దాస్​ ముష్ఫికర్​ రహీమ్​, అరాఫత్​ సన్నీ, అల్​అమిన్​ హొస్సేన్​, ముష్ఫికర్​ రహ్మాన్​, షైఫుల్​ ఇస్లాం, అబు హైదర్​ రోనీ, మహ్మద్​ మిథున్​, తైజుల్​ ఇస్లాం​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
IRAQ PRIME MINISTER'S OFFICE HANDOUT - AP CLIENTS ONLY
Baghdad - 2 November 2019
++MUTE++
1. Various of Iraqi Prime Minister Adel Abdul-Mahdi meeting security chiefs
STORYLINE:
Iraqi Prime Minister Adel Abdul-Mahdi headed a meeting with his security chiefs late on Saturday.
During the meeting, Mahdi stressed the need to preserve peace, security and the safety of hundreds of protesters, who have been taking to the streets of Baghdad calling for reforms, job opportunities and an end to government corruption.
The current protests are the largest display of public anger against Abdul-Mahdi's year-old government.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.