గెలిస్తేనే సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయనే మ్యాచ్‌లో ఆసిస్ దుమ్ములేపింది. కంగారుల జట్టు బ్యాట్స్‌మెన్ పీటర్ హ్యాండ్స్కోంబ్ శతకంతో ఆటను లాక్కొస్తే...చివర్లో టర్నర్ సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా 2-2తో సిరీస్ సమమైంది. చివరి మ్యాచ్ ఈ నెల 13న దిల్లీలో జరగనుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీ టర్నర్ అందుకున్నాడు.
- ఆదిలో ఆట స్లో...
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుబెబ్బ తగిలింది. తొలి ఓవర్లోనే కెప్టెన్ ఫించ్‌ను భువనేశ్వర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. షాన్ మార్ష్ కూడా తక్కువ పరుగులకే ఔటయ్యాడు. 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది ఆసిస్. అనంతరం ఖవాజా, హాండ్స్ కోంబ్ తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. ఇద్దరూ ఆచితూచి ఆడుతూ అర్ధశతకాలు సాధించారు. 105 బంతుల్లో 117 పరుగులు చేసిన హ్యాండ్స్కోంబ్ విజయంపై ఆశలు నిలిపాడు.
THERE IT IS! A maiden ODI 💯 for Peter Handscomb. Brilliant 👏👏
— cricket.com.au (@cricketcomau) March 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
AUS 3-215. LIVE: https://t.co/iCK26mSpUz #INDvAUS pic.twitter.com/0PurUXHLGy
">THERE IT IS! A maiden ODI 💯 for Peter Handscomb. Brilliant 👏👏
— cricket.com.au (@cricketcomau) March 10, 2019
AUS 3-215. LIVE: https://t.co/iCK26mSpUz #INDvAUS pic.twitter.com/0PurUXHLGyTHERE IT IS! A maiden ODI 💯 for Peter Handscomb. Brilliant 👏👏
— cricket.com.au (@cricketcomau) March 10, 2019
AUS 3-215. LIVE: https://t.co/iCK26mSpUz #INDvAUS pic.twitter.com/0PurUXHLGy
- బంతి పడితే అవతలకే...
AUSTRALIA WIN! Ashton Turner take a bow. The series is tied, we have a decider on Wednesday! #INDvAUS pic.twitter.com/k3bDvJFTa9
— cricket.com.au (@cricketcomau) March 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">AUSTRALIA WIN! Ashton Turner take a bow. The series is tied, we have a decider on Wednesday! #INDvAUS pic.twitter.com/k3bDvJFTa9
— cricket.com.au (@cricketcomau) March 10, 2019AUSTRALIA WIN! Ashton Turner take a bow. The series is tied, we have a decider on Wednesday! #INDvAUS pic.twitter.com/k3bDvJFTa9
— cricket.com.au (@cricketcomau) March 10, 2019
విధ్వంసకర బ్యాట్స్‌మెన్ మ్యాక్స్‌వెల్ 23 పరుగులకే ఔటయ్యాడు. ఇక భారత్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. అప్పుడు క్రీజులోకి అడుగుపెట్టిన టర్నర్ 43 బంతుల్లో 84 పరుగులు(5 ఫోర్లు,6 సిక్సులు)తో చివరివరకు పాతుకుపోయాడు. బౌలర్‌తో పనిలేకుండా, ఫీల్డర్లకు పనిచెప్పకుండా బంతితో ఓ ఆట ఆడేసుకున్నాడు. ఈ ఆటగాడి దెబ్బకు 359 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి 47.5 ఓవర్లలోనే ఛేదించేసింది ఆస్ట్రేలియా.
- ఓపెనింగ్ అదిరే..
Before the Aussie fightback, Shikhar Dhawan answered any doubters of his World Cup credentials, rights @samuelfez https://t.co/veK1Esu8ee #INDvAUS pic.twitter.com/8NR2BFg2IV
— cricket.com.au (@cricketcomau) March 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Before the Aussie fightback, Shikhar Dhawan answered any doubters of his World Cup credentials, rights @samuelfez https://t.co/veK1Esu8ee #INDvAUS pic.twitter.com/8NR2BFg2IV
— cricket.com.au (@cricketcomau) March 10, 2019Before the Aussie fightback, Shikhar Dhawan answered any doubters of his World Cup credentials, rights @samuelfez https://t.co/veK1Esu8ee #INDvAUS pic.twitter.com/8NR2BFg2IV
— cricket.com.au (@cricketcomau) March 10, 2019
వరుసగా మూడు మ్యచ్‌ల్లో విఫలమై విమర్శలు ఎదుర్కొన్న ధావన్, రోహిత్ ఈ వన్డేలో ఆచితూచి ఆడారు. సింగిల్స్‌కి ప్రాధాన్యం ఇస్తూనే చెత్త బంతుల్ని బౌండరీకి తరలించారు. ఈ క్రమంలో ఇద్దరూ తమ అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. అనంతరం ధాటిగా ఆడిన వీరిద్దరూ ఫోర్లు, సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. భారీ షాట్ ఆడబోయి 95 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ ఔటయ్యాడు. దీంతో 193 పరుగులు భాగస్వామ్యానికి తెరపడింది. ఆసీస్‌పై భారత్‌కు ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం.
ఇదే క్రమంలో ధావన్ తన 16వ వన్డే శతకాన్ని నమోదు చేసుకున్నాడు. 143 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కమిన్స్ బౌలింగ్లో ఔటయ్యాడు. వన్డేల్లో శిఖర్‌కు ఇవే అత్యధిక పరుగులు కావడం విశేషం. కోహ్లీ (7) రాహుల్ (26), జాదవ్ (10) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. ప్రపంచకప్ జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తున్న పంత్ 24 బంతుల్లో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. విజయ్ శంకర్ 26 పరుగులు చేశాడు.
- ఆస్ట్రేలియా బౌలర్లు ఈ మ్యాచ్‌లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. కమిన్స్ 5 వికెట్లు తీసి ఆకట్టుకోగా జ్యే రిచర్డ్ సన్ మూడు, జంపా ఒక వికెట్ తీసుకున్నారు.