ETV Bharat / sports

ఈ సిరీస్​ మొత్తం మాకు కఠిన పరీక్షే: మోర్గాన్ - ఇయాన్ మోర్గాన్

పరిమిత ఓవర్ల క్రికెట్​లో భారత జట్టు చాలా పటిష్ఠంగా ఉందని తెలిపాడు ఇంగ్లాండ్ సారథి ఇయాన్ మోర్గాన్. సొంతగడ్డపై టీమ్​ఇండియాను ఎదుర్కోవడం సవాలుతో కూడుకున్నదని అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్​ ఆసాంతం కోహ్లీ సేనను నిలువరించడం కష్టమని పేర్కొన్నాడు.

India are the team to beat: Eoin Morgan
ఈ సిరీస్​ మొత్తం మాకు కఠిన పరీక్షే: మోర్గాన్
author img

By

Published : Mar 12, 2021, 2:09 PM IST

భారత్​తో టీ20 సిరీస్​కు ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్​ మోర్గాన్​. టీ20 ప్రపంచకప్​కు ముందు జరుగుతున్న ఈ పరిమిత ఓవర్ల సిరీస్​లను తాము​ సన్నాహాక మ్యాచ్​లాగా పరిగణిస్తామని తెలిపాడు. సొంతగడ్డపై భారత్​ను ఎదుర్కోవడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. ​ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుతో పోటీపడబోతున్నామని వెల్లడించాడు.

వైట్​బాల్ క్రికెట్​లో టీమ్​ఇండియాను ఎదుర్కోవడం సవాలుతో కూడుకున్నదని మోర్గాన్ తెలిపాడు. విరాట్​ నేతృత్వంలోని భారత జట్టు.. పరిమిత ఓవర్ల క్రికెట్​లో పటిష్టంగా ఉందన్నాడు.

"టీ20 వరల్డ్​కప్​ భారత్​లో జరగనుంది. టీమ్​ఇండియా టైటిల్​ ఫేవరేట్​గా బరిలోకి దిగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సిరీస్ ఆసాంతం మాకు కఠిన పరీక్ష ఎదురవనుంది. ఒక టీ20లు మాత్రమే కాదు.. రెండు సిరీస్​లు సవాల్తో​ కూడినవి."

-ఇయాన్ మోర్గాన్, ఇంగ్లాండ్ వన్డే, టీ-20 కెప్టెన్.

పేసర్​ జోఫ్రా ఆర్చర్​తో సహా తమ ఆటగాళ్లందరూ ఫిట్​గా ఉన్నారని, సిరీస్​కు అందరూ అందుబాటులో ఉంటారని మోర్గాన్​ స్పష్టం చేశాడు. జట్టు కూర్పుపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇయాన్​ తిరస్కరించాడు.

ఇదీ చదవండి: రికార్డ్​ అలర్ట్​: మిథాలీ పది వేల పరుగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.