ETV Bharat / sports

అత్యంత చెత్తగా ర్యాంకింగ్స్ ఇచ్చారు: వాన్

author img

By

Published : Dec 25, 2019, 5:41 PM IST

మంగళవారం ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్, న్యూజిలాండ్​లకు సరైన ప్రదర్శన చేయనప్పటికీ మెరుగైన ర్యాంకులు ఇచ్చారని, ఆస్ట్రేలియా సత్తాచాటినా.. ఐదో ర్యాంకు ఇవ్వడమేంటని ప్రశ్నించాడు.

India and Australia best Test match teams in world: Michael Vaughan
మైఖేల్​ వాన్​

అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ) ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్​పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ విమర్శలు సంధించాడు. అత్యంత చెత్తగా ర్యాంకింగ్స్ ప్రకటించారని అభిప్రాయపడ్డాడు. టెస్టుల్లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ సరైన ప్రదర్శన చేయనప్పటికీ ఆ జట్లు రెండు, నాలుగు స్థానాల్లో ఉండటమేంటో అర్థం కావట్లేదని అన్నాడు.

"ఐసీసీ ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్​పై నిజాయితీగా మాట్లాడలనుకుంటున్నా. అత్యంత చెత్తగా ర్యాంకింగ్స్​ను ఇచ్చారు. గత రెండేళ్లుగా టెస్టుల్లో న్యూజిలాండ్ ఏ మేరకు రాణించిందో నాకు అర్థం కావట్లేదు. మొన్నటివరకు ఇంగ్లాండ్ మూడో స్థానంలో ఉంది. ఇప్పుడు నాలుగో ర్యాంకుకు దిగజారింది. మూడేళ్లుగా ఇంగ్లీష్ జట్టు.. టెస్టుల్లో ఇబ్బంది ఎదుర్కొంటోంది. ముఖ్యంగా విదేశాల్లో ఆ జట్టు ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. స్వదేశంలో ఒకే ఒక్క సిరీస్ నెగ్గింది. యాషెస్​ సిరీస్​లోనూ డ్రాతో సరిపెట్టుకుంది. ఐర్లాండ్​ లాంటి చిన్న జట్టుపైనే వారు గెలిచారు" -మైఖేల్ వాన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్​

ఈ ర్యాంకింగ్స్​ ప్రకటించడం చూసి తనకు అయోమయంగా అనిపించిందని అన్నాడు వాన్

"నా అభిప్రాయం ప్రకారం న్యూజిలాండ్​ రెండో స్థానంలో ఉండే అంత పటిష్ఠ జట్టు కాదు. ఆస్ట్రేలియా ఆ స్థానానికి తగిన జట్టు. ఈ ర్యాంకింగ్స్​ ఇవ్వడం చూసి నాకు అయోమయంగా అనిపించింది." - మైఖేల్ వాన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్

ప్రస్తుతం టెస్టుల్లో భారత్​, ఆస్ట్రేలియానే అత్యుత్తమ జట్లని కితాబిచ్చాడు వాన్.

"సుదీర్ఘ ఫార్మాట్​లో భారత్, ఆస్ట్రేలియా.. అత్యుత్తమ జట్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆసీస్​ను ఓడించగల సత్తా ఉన్న ఏకైక జట్టు టీమిండియానే. ఏడాది క్రితం ఆసీస్ ఒత్తిడిలో ఉన్న మాట వాస్తవం. ప్రస్తుతం ఐదో ర్యాంకులో ఉంది. స్మిత్, వార్నర్, లబుషేన్​ లాంటి స్టార్లు లేనప్పుడు వారు ఆ ర్యాంకులో ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి మారింది." -మైఖేల్ వాన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్

దక్షిణాఫ్రికా - ఇంగ్లాండ్ మధ్య నాలుగు టెస్టుల సిరీస్​లో భాగంగా తొలి మ్యాచ్​ గురువారం నుంచి మొదలుకానుంది. సెంచూరియన్ వేదిక.

ఇదీ చదవండి: 'ఆస్ట్రేలియా ఓపెన్' ప్రైజ్​మనీ భారీగా పెరిగిందోచ్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 25 December 2019
1. Various of protesters chanting inside shopping mall
2. Police patrolling
STORYLINE:
Anti-government protesters held a Christmas day demonstration at a large shopping mall in Hong Kong on Wednesday.
The demonstrators descended upon Shatin New Town plaza, shouting slogans as they passed shops at the mall.
The protests erupted in June over proposed extradition legislation and then mushroomed into a sustained anti-government movement pushing for full democracy and other demands have burned through police manpower.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.