అహ్మదాబాద్ డే/నైట్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 145 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోర్ 99/3తో రెండోరోజు ఆట మొదలు పెట్టిన టీమ్ఇండియా.. త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే కోహ్లీ సేన 33 పరుగుల ఆధిక్యంలో ఉంది. 66 పరుగులు చేసిన రోహిత్ శర్మ జట్టు టాప్ స్కోరర్. ఇంగ్లాండ్ బౌలర్లలో రూట్ 5, లీచ్ 4 వికెట్లు తీసుకున్నారు.
ఆట మొదలైన కాసేపటికే 114 పరుగుల వద్ద ఆజింక్య రహానెను.. లీచ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. స్కోరు బోర్డులో మరో పరుగు జోడించాక రోహిత్ శర్మను కూడా లీచ్ ఎల్బీగా పెవిలియన్‌కు పంపాడు.
ఆ తర్వాత 42వ ఓవర్లో బంతి అందుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్.. రిషభ్ పంత్‌ను కీపర్ క్యాచ్‌గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్నూ.. రూట్ క్లీన్ బౌల్డ్‌గా ఔట్ చేశాడు. తదుపరి వచ్చిన అక్షర్ కూడా అతనికే చిక్కాడు.
తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్ ధాటిగా ఆడే క్రమంలో.. ఓ భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔటయ్యాడు.
స్పిన్‌కు సహకరిస్తున్న మొతేరా పిచ్‌పై ఇరు జట్ల స్పిన్నర్లు 18 వికెట్లు పడగొట్టారు. పేసర్లకు కేవలం రెండు వికెట్లు మాత్రమే దక్కాయి. రెండు జట్ల తొలి ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 8 మంది బ్యాట్స్మెన్లు ఎల్బీగా వెనుదిరగడం విశేషం.
ఇదీ చదవండి: ప్రపంచకప్ మ్యాచ్‌ల లైవ్ కోసం ఐసీసీ భారీ డీల్