అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ 365 పరుగులకు ఆలౌటైంది. 294/7 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన టీమ్ఇండియా మరో 71 పరుగులు జోడించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టోక్స్ 4, అండర్సన్ 3, లీచ్ 2, వికెట్లు తీసుకున్నారు.
సుందర్, అక్షర్ల జంట ఎనిమిదో వికెట్కు 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. వీరిద్దరూ ఇండియాను తిరుగులేని స్థితిలో నిలబెట్టారు. ఈ జోడీ టాపార్డర్ బ్యాట్స్మెన్లలా ఇంగ్లాండ్ బౌలర్లను ఓ ఆటాడుకుంది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 160 పరుగుల ఆధిక్యం సంపాదించింది.
ఇదీ చదవండి: 'పంత్.. నువ్వు నిజమైన మ్యాచ్ విన్నర్వి'