మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు అదృష్టం కలిసొచ్చింది. సెమీస్ ఆడకుండానే నేరుగా, తొలిసారి ఈ టోర్నీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. సిడ్నీలో ఇంగ్లాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడమే ఇందుకు కారణం.
ఉదయం నుంచి ఆగకుండా కురుస్తున్న వాన వల్ల టాస్ పడలేదు. ఆ తర్వాత కొద్దిసేపటి వరకు చూసిన అంపైర్లు, మ్యాచ్‌ను రద్దు చేశారు. రిజర్వ్‌డే లేనందున లీగ్ దశలో అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటం వల్ల నేరుగా తుదిపోరుకు అర్హత సాధించింది టీమిండియా.
ఇదే మైదానంలో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇదీ వర్షం కారణంగా రద్దయితే అత్యధిక పాయింట్లు ఉన్న సఫారీలు ఫైనల్‌కు చేరుకుంటారు. ఈ ఆదివారం.. భారత్‌తో కప్పు కోసం తలపడతారు.