ETV Bharat / sports

బుల్లితెరపై భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్​ రికార్డు - బుల్లితెరపై భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్​ రికార్డు

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్​ అత్యధిక వీక్షణలతో రికార్డు సృష్టించింది. ఈ సిరీస్​ను మొత్తంగా 103 మిలియన్ల మంది చూశారు.

IND vs ENG Test
భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్​
author img

By

Published : Mar 20, 2021, 10:16 AM IST

ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టు సిరీస్​ను 3-1 తేడాతో కైవసం చేసుకుని ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో చోటు దక్కించుకుంది టీమ్ఇండియా. ఈ సిరీస్​కు ఇదొక్కటే హైలైట్ కాదు.​ ఐదేళ్లలో ఎక్కువ మంది వీక్షించిన టెస్టు సిరీస్​గానూ రికార్డు సృష్టించిందీ సిరీస్. టెలివిజన్​లో సగటున నిమిషానికి 1.3 మిలియన్ మంది ఈ మ్యాచ్​ను చూడటం విశేషం. మొత్తంగా 103 మిలియన్ మంది ఈ సిరీస్ చూశారు.

టెస్టు ఫార్మాట్​ ఆదరణ తగ్గిపోతోన్న సమయంలో ఈ రికార్డు మరోసారి జెంటిల్​మెన్ గేమ్ ప్రాముఖ్యాన్ని చాటిచెప్పింది. కాగా, భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగే వన్డే సిరీస్​తో పాటు టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్​కు ఇలాగే వ్యూస్ రావాలని ఆశిస్తోంది ప్రసారదారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.