ETV Bharat / sports

రెండో టెస్టులో భారత్​ ఆధిపత్యం- ఇంగ్లాండ్​ 53/3

author img

By

Published : Feb 15, 2021, 5:20 PM IST

టీమ్​ఇండియాతో జరుగుతోన్న రెండో టెస్టులో మూడో రోజు ఆటముగిసేసరికి ఇంగ్లాండ్ 53 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. క్రీజులో డేనియల్​ లారెన్స్​(19), జో రూట్​(2) ఉన్నారు. భారత బౌలర్లలో అక్షర్(2), అశ్విన్​ ఓ వికెట్​ను దక్కించుకున్నారు.

england
ఇంగ్లాండ్​

చెపాక్​ స్డేడియంలో జరుగుతోన్న రెండో టెస్టులో ఇంగ్లాండ్​పై భారత బౌలర్లు విరుచుకుపడ్డారు. మూడో రోజు ఆటముగిసేసరికి ఇంగ్లీష్​ జట్టు లక్ష్యానికి 429 పరుగుల వెనుకంజలో ఉంది. రెండో ఇన్నింగ్స్​లో 19 ఓవర్లకు మూడు వికెట్లు​ కోల్పోయి 53 పరుగులు చేసింది.

రెండో ఇన్నింగ్స్​ ప్రారంభించిన ఇంగ్లాండ్​కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్​గా బరిలో దిగిన డొమినిక్​ సిబ్లే.. అక్షర్ పటేల్​ బౌలింగ్​లో ఎల్​బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 8 ఓవర్​లో 17 పరుగలు వద్ద తొలి వికెట్​ను కోల్పోయింది ఇంగ్లీష్​ జట్టు. అనంతరం వరుస ఓవర్లలో రెండు వికెట్లను చేజార్చుకుంది. అశ్విన్​ బౌలింగ్​లో 15.6 ఓవర్​లో 49 పరుగులు వద్ద రోరీ బర్న్స్​(25) రెండో వికెట్​గా ఔట్​ అయ్యాడు. షాట్​కు యత్నంచి కోహ్లీ చేతికి చిక్కాడు. 16.6 ఓవర్​లో అక్షర్​ బౌలింగ్​లో జాక్​ లీచ్​ ఒక్క పరుగు కూడా చేయకుండానే తొలి బంతికే రోహిత్​ చేతికి క్యాచ్​ ఇచ్చి పెవిలియన్​ చేరాడు. దీంతో 50 పరుగులు వద్ద మూడో వికెట్​ను కోల్పోయింది ప్రత్యర్థి జట్టు. ప్రస్తుతం క్రీజులో డేనియల్​ లారెన్స్​(19), జో రూట్​(2) ఉన్నారు. భారత బౌలర్లలో అక్షర్​(2), అశ్విన్​ ఓ వికెట్​ను దక్కించుకున్నారు.

అంతకుముందు తొలి ఇన్నింగ్స్​లో భారత్​ 329 పరుగులు చేయగా..ఇంగ్లాండ్​ 134 పరుగులు చేసి ఆలౌట్​ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా 286 పరుగులు చేసింది.

ఇదీ చూడండి: భారత్​ ఆలౌట్​- ఇంగ్లాండ్​ లక్ష్యం 482

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.