ETV Bharat / sports

ఇంగ్లాండ్​పై భారత్ విజయం.. గేమ్ ఛేంజర్స్ వీరే!

ఇంగ్లాండ్​తో జరిగిన రెండో టెస్టులో టీమ్ఇండియా ఘనవిజయం సాధించింది. 317 పరుగుల తేడాతో గెలిచి సిరీస్​ను 1-1 తేడాతో సమం చేసింది. ఈ మ్యాచ్​ తొలి ఇన్నింగ్స్​లో​ 161 పరుగులతో రాణించిన రోహిత్​తో పాటు స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ పటేల్ భారత జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించారు.

IND vs ENG
ఇంగ్లాండ్​పై భారత్ విజయం.. వీరిదే కీలకపాత్ర!
author img

By

Published : Feb 16, 2021, 12:56 PM IST

Updated : Feb 16, 2021, 1:01 PM IST

ఇంగ్లాండ్​తో జరిగిన రెండో టెస్టులో టీమ్ఇండియా ఘనవిజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్​లో 164 పరుగులకు ఆలౌటైన ఇంగ్లీష్ జట్టు 317 రన్స్ తేడాతో ఓటమి చవిచూసింది. మొదటి టెస్టులో విజయంతో జోష్​ మీదున్న ఇంగ్లాండ్​ను దెబ్బకు దెబ్బ కొట్టి సిరీస్​ను 1-1తేడాతో సమం చేసింది భారత జట్టు. ఈ విజయంలో రోహిత్ శర్మతో పాటు స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించారు.

సెంచరీతో కదం తొక్కిన రోహిత్

మొదటి టెస్టులో విఫలమవడం వల్ల విమర్శలు ఎదుర్కొన్న టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో 161 పరుగులతో భారీ శతకం సాధించాడు. ఆది నుంచి దాటిగా ఆడుతూ ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పతిప్పలు పెట్టాడు. ఫలితంగా వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. చెత్త బంతులను బౌండరీ తరలిస్తూనే మంచి బంతులకు సింగిల్స్ తీస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్​లో వరుసగా వికెట్లు పడుతున్నా.. మొక్కవోని దీక్షతో బ్యాటింగ్ చేశాడు. ఈ ఇన్నింగ్స్​లో 231 బంతులను ఎదుర్కొన్న హిట్​మ్యాన్ 2 సిక్సులు, 18 బౌండరీల సాయంతో 161 పరుగులు సాధించాడు. ఇతడు సెంచరీ చేసే సమయానికి భారత జట్టు స్కోర్ 147 మాత్రమే. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు తొలి ఇన్నింగ్స్​లో రోహిత్ ఎంత విలువైన ఇన్నింగ్స్ ఆడాడో.

IND vs ENG
రోహిత్

అటు బంతి, ఇటు బ్యాట్​తో అశ్విన్

ఈ మ్యాచ్‌ నిస్సందేహంగా అశ్విన్‌దే. రెండో రోజు తన స్పిన్‌ మాయాజాలంతో ఇంగ్లాండ్‌ను ముప్పుతిప్పలు పెట్టిన అతడు.. మూడో రోజు అదిరే బ్యాటింగ్‌తో ఆ జట్టును దెబ్బతీశాడు. లేదంటే భారత్‌ ఇంత భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగేది కాదు. అశ్విన్‌ క్రీజులోకి వచ్చేటప్పటికి స్కోరు 106/6. కోహ్లీకి అతడు తోడు కావడం వల్ల జట్టు క్రమంగా కోలుకుంది. 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టోక్స్‌ క్యాచ్‌ వదిలేయడం వల్ల బతికిపోయిన అతడు.. అలవోకగా షాట్లు ఆడాడు. ఎక్కువగా స్క్వేర్‌లోకి ఆడాడు. స్పిన్‌ బౌలింగ్‌లో చక్కని కట్స్‌, పుల్‌ షాట్స్‌, స్వీప్స్‌ ఆడిన అశ్విన్.. పేసర్లనూ సమర్థంగా ఎదుర్కొన్నాడు. టీ విరామ సమయానికి అశ్విన్‌ 68 వద్ద ఉన్నాడు. మిగిలింది ఇద్దరు టెయిలెండర్లే. అయినా ధాటిగా బ్యాటింగ్‌ చేసిన అతడు వాళ్లిద్దరిని కాపాడుకుంటూ, వాళ్ల సహకారంతో టెస్టుల్లో అయిదో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్​లోనూ మూడు వికెట్లతో రాణించాడు. రోరీ బర్న్స్, లారెన్స్, బెన్ స్టోక్స్ వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

IND vs ENG
అశ్విన్

అక్షర్ అదిరే అరంగేట్రం

టీమ్ఇండియా యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ టెస్టు అరంగేట్రంలోనే సత్తాచాటాడు. మొదటి ఇన్నింగ్స్​లో రెండు వికెట్లతో ఆకట్టుకున్న ఇతడు రెండో ఇన్నింగ్స్​లో ఐదు వికెట్లతో అద్భుత ప్రదర్శన చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. మొదటి టెస్టులో డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న ఇంగ్లాండ్ సారథి రూట్​ను.. రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్​లోనూ ఔట్ చేసి భారత్​ను ఆధిక్యంలో నిలబెట్టాడు. స్పిన్​కు అనుకూలించే పిచ్​పై బంతిని టర్న్ టేస్తూ బౌన్స్ రాబడుతూ ఇంగ్లాండ్​ బ్యాట్స్​మెన్​ను ముప్పతిప్పలు పెట్టాడు.

IND vs ENG
అక్షర్ పటేల్

Last Updated : Feb 16, 2021, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.