ETV Bharat / sports

చెన్నై టెస్టు: తొలి రోజు ఆట పూర్తి- టీమ్​ఇండియా 300/6 - తొలిరోజు ఆటలో హైలెట్స్​

ఇంగ్లండ్​తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్​ తొలిరోజు ఆట ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. ఓపెనర్​ రోహిత్​ శర్మ భారీ శతకం(161)తో చెలరేగగా.. వైస్​ కెప్టెన్​ అజింక్య రహానె అర్ధ సెంచరీ(67)తో రాణించాడు. పర్యటక జట్టు బౌలర్లలో మొయిన్​ అలీ, జాక్​ లీచ్​ రెండేసి వికెట్లు పడగొట్టారు.

Ind vs Eng 2nd Test at Chennai
చెన్నై టెస్ట్​లో తొలి రోజు భారత్​ స్కోరు 300-6
author img

By

Published : Feb 13, 2021, 5:13 PM IST

Updated : Feb 13, 2021, 6:00 PM IST

చెన్నై వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమ్​ఇండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 161 (231 బంతుల్లో 18ఫోర్లు, 2సిక్సులు), అజింక్య రహానె 67 (9ఫోర్లు) మెరిశారు. వీరిద్దరూ నాలుగో వికెట్​కు 162 పరుగులు జోడించారు. క్రీజులో రిషభ్​ పంత్​( 33), అక్షర్​ పటేల్​(5) ఉన్నారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో మొయిన్​ అలీ, జాక్​ లీచ్​ రెండేసి వికెట్లు దక్కించుకోగా.. ఓలీ స్టోన్​, కెప్టెన్​ రూట్​ తలో వికెట్​ తీశారు.

0-1తో మొదలు..

చెపాక్​ పిచ్​పై టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న భారత్​కు ఆశించినంత శుభారంభం దక్కలేదు. స్కోరుబోర్డుపై పరుగులేమీ లేకుండానే డకౌట్​గా తొలి వికెట్​ రూపంలో వెనుదిరిగాడు శుభ్​మన్​ గిల్​. ఆ తర్వాత వచ్చిన పుజారాతో కలిసి.. మరో ఓపెనర్​ రోహిత్​ శర్మ 85 పరుగులు జోడించాడు. ఈ జోడీ కుదురుకుంటున్న క్రమంలో.. జాక్​ లీచ్​ బౌలింగ్​లో పుజారా(21) క్యాచ్​ ఔటయ్యాడు. ఈ సమయంలో భారీ అంచనాలతో క్రీజులోకి అడుగుపెట్టిన కెప్టెన్​ విరాట్​ కోహ్లీ(0) పూర్తిగా నిరాశపరిచాడు. స్పిన్నర్​ మొయిన్​ అలీ అతడ్ని బౌల్డ్​ చేశాడు. ఓ స్పిన్నర్​ బౌలింగ్​లో కోహ్లీ పరుగులేమీ చేయకుండా ఔటవ్వడం ఇదే తొలిసారి. దీంతో 3 వికెట్ల నష్టానికి 106 పరుగులతో లంచ్​కు వెళ్లింది టీమ్​ఇండియా.

రెండో సెషన్​లో ఆచితూచి..

విరామం అనంతరం.. భారత స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. భారీ షాట్లతో అలరించిన హిట్​మ్యాన్ సుదీర్ఘ ఫార్మాట్​లో ఏడో శతకాన్ని నమోదు చేశాడు. రహానె కూడా నిలకడగా ఆడటంతో వికెట్లేమీ నష్టపోకుండా రెండో సెషన్​ను ముగించింది భారత్​.

చివర్లో ఇంగ్లండ్​ ఆధిపత్యం..

ఇక మూడో సెషన్​లో ఓ వైపు రోహిత్​, మరోవైపు అజింక్య కాస్త దూకుడు పెంచారు. ఇద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదడంతో రన్​రేట్​ బాగా పెరిగింది. ఈ క్రమంలో 150 పరుగులు చేసి.. ద్విశతకం దిశగా సాగుతున్న హిట్​మ్యాన్​ ఓ షాట్​ ఆడబోయి జాక్​లీచ్​ బౌలింగ్​లో క్యాచ్​ ఔట్​ అయ్యాడు. దీంతో 162 పరుగుల నాలుగో వికెట్​ భాగస్వామ్యానికి తెరపడింది. నిలకడగా ఆడుతున్న రహానె కూడా మొయిన్​ అలీ బౌలింగ్​లో బౌల్డయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అశ్విన్​(13) తక్కువ స్కోరుకే పెవిలియన్​ చేరాడు. దీంతో ఈ సెషన్​లో ఇంగ్లాండ్​ ఆధిపత్యం కనబర్చినట్లైంది. ఈ క్రమంలో మరో వికెట్​ పడకుండా జాగ్రత్తగా ఆడిన పంత్​, అక్షర్​ పటేల్​ జోడీ.. స్కోరును 300 దాటించింది.

ఇదీ చదవండి: 'రెండో టెస్టులో 300 చేసినా చెపాక్​లో 500తో సమానం'

Last Updated : Feb 13, 2021, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.