పుణె వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గాయాలతో ఈ మ్యాచ్‌కు ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్, బిల్లింగ్స్, శ్రేయస్ అయ్యర్ దూరమయ్యారు. ఇదే మ్యాచ్‌లో భారత్ తరఫున పంత్ చోటు దక్కించుకున్నాడు. ఇప్పటికే తొలి మ్యాచ్ గెలిచి ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేన.. దీనిని గెలిచి సిరీస్ చేజిక్కుంచుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటోంది.
జట్లు
టీమ్ఇండియా: ధావన్, రోహిత్, కోహ్లీ(కెప్టెన్), కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, శార్దుల్ ఠాకుర్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్
ఇంగ్లాండ్: జేసన్ రాయ్, బెయిర్‌స్టో, బట్లర్(కెప్టెన్), స్టోక్స్, మొయిన్ అలీ, సామ్ కరన్, టామ్ కరన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, లివింగ్‌స్టోన్, రీసి టోప్లే