ETV Bharat / sports

ఆస్ట్రేలియాకు పయనమైన హిట్​మ్యాన్​

ఇటీవలే ఫిట్​నెస్​ను నిరూపించుకున్న టీమ్​ఇండియా వైస్​ కెప్టెన్​ రోహిత్​శర్మ.. మంగళవారం ఆస్ట్రేలియాకు పయనమయ్యాడు. దుబాయ్​ మీదుగా హిట్​మ్యాన్​ ఆస్ట్రేలియా చేరుకోనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

author img

By

Published : Dec 15, 2020, 5:36 PM IST

Ind vs Aus: Rohit Sharma leaves for Australia
ఆస్ట్రేలియాకు పయనమైన హిట్​మ్యాన్​

కొన్ని రోజుల ఉత్కంఠ తర్వాత టీమ్​ఇండియా వైస్​ కెప్టెన్​ రోహిత్​శర్మ.. ఆస్ట్రేలియాకు పయనమయ్యాడు. గాయం కారణంగా ఆసీస్​తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్​కు దూరమైన హిట్​మ్యాన్​.. ఇటీవలే తన ఫిట్​నెస్​ నిరూపించుకుని కంగారూలతో టెస్టు సిరీస్​కు సిద్ధమయ్యాడు. అడిలైడ్ వేదికగా జరగబోయే మూడో టెస్టులో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం విమానం ఎక్కిన హిట్​మ్యాన్​.. దుబాయ్​ మీదుగా ఆస్ట్రేలియా చేరుకోనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

గత శుక్రవారం ఎన్‌సీఏలో నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో రోహిత్ పాసయ్యాడని బీసీసీఐ ప్రకటించింది. ఫలితంగా రోహిత్ ఆస్ట్రేలియాకు బయల్దేరి వెళ్తాడని ఇదివరకే తెలిపింది. అక్కడ 14 రోజుల క్వారంటైన్ తర్వాత జట్టు సభ్యులతో రోహిత్​ కలవనున్నాడు. దీంతో ఆసీస్​తో జరగనున్న తొలి రెండు టెస్టులకు దూరం కానున్నాడు. జ‌న‌వ‌రి 7న సిడ్నీలో ప్రారంభ‌మ‌య్యే మూడో టెస్టు స‌మ‌యానికి రోహిత్ టీమ్‌కు అందుబాటులో ఉంటాడు.

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో రోహిత్ తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఆ కారణంగానే లీగ్‌ స్టేజ్‌లో పలు మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అదే సమయంలో బీసీసీఐ.. ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించి మూడు జట్లను ప్రకటించగా అందులో రోహిత్‌ పేరు లేదు. అనంతరం రోహిత్‌ ప్లేఆఫ్స్‌, ఫైనల్స్‌లో ఆడి ముంబయి జట్టును ఐదోసారి విజేతగా నిలిపాడు.

ఇదీ చూడండి: కరోనా నిబంధనలు బేఖాతరు.. లిన్, లారెన్స్​లకు ఫైన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.