ETV Bharat / sports

ఫైనల్​ ముందు ధోనీ మాట్లాడింది రెండు నిమిషాలే! - Chennai Super Kings

చెన్నై సూపర్​కింగ్స్​ సారథి​ ధోనీ నాయకత్వం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు ఆ జట్టు సభ్యుడు పార్థివ్​ పటేల్. ఉత్కంఠ సమయంలో మిస్టర్​ కూల్​ ఎలా వ్యవహరిస్తాడో చెప్పాడు.

MS Dhoni
ఐపీఎల్​ ఫైనల్​ ముందు ధోనీ మాట్లాడింది రెండు నిమిషాలే...
author img

By

Published : May 29, 2020, 4:10 PM IST

ఐపీఎల్​లో చెన్నైసూపర్​కింగ్స్​తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు సీనియర్​ క్రికెటర్​ పార్థివ్​ పటేల్. గత 12 ఎడిషన్లపై జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో జట్టు సహా సారథి ధోనీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 2008లో జరిగిన ఫైనల్లో ధోనీ మ్యాచ్​కు ముందు కేవలం రెండు నిమిషాలు మాత్రమే అందరితో సమావేశం నిర్వహించాడని చెప్పాడు. కెప్టెన్​గా మహీ ప్రతి ఒక్కరిని ముందే అర్థం చేసుకుంటాడని.. అందుకే అలాంటి సమయాల్లో పెద్దగా చర్చించడని వెల్లడించాడు.

"2008 ఫైనల్​ మ్యాచ్​ ఆడటానికి వెళ్లేముందు కేవలం 2 నిమిషాలే బృంద సమావేశం జరిగింది. 2019లోనూ మహీ అలానే చేసి ఉండొచ్చు. ప్రతి ఆటగాడి గురించి అతనికి పూర్తి అవగాహన ఉంటుంది. చెన్నై సూపర్​కింగ్స్​లో ఆడటం వల్ల మైఖేల్​ హస్సీ, స్టీఫెన్​ ఫ్లెమింగ్​, మాథ్యూ హెడెన్​ల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా"

-పార్థివ్​ పటేల్​

"తుదిజట్టులోని సభ్యులు ప్రతి ఒక్కరూ ఏదో ఒక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఆ విషయంలో మహీ చాలా పక్కాగా ఉంటాడు. ఐపీఎల్​ ప్రణాళికలు వెంట వెంటనే మారిపోతుంటాయి. విశ్లేషణలు, వ్యూహాలు, ఎత్తులు రచించడం చాలా ముఖ్యం. అప్పట్లో చివరి 5 ఓవర్లలో మేము 30 నుంచి 36 పరుగులు చేస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు 50 నుంచి 60 రన్స్​ చేసినా సరిపోవట్లేదు" అని చెప్పాడు పార్థివ్​.

2008 ఐపీఎల్​లో చెన్నై జట్టు అద్భుతంగా ఆడినా.. ఫైనల్లో తడబడి పెద్దగా అంచనాల్లేని రాజస్థాన్​ రాయల్స్​కు టైటిల్​ అప్పజెప్పింది.

ఇదీ చూడండి: టీ20 వాయిదా పడితే భారీ 'ఆర్థిక కష్టాలు' తప్పవు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.