ETV Bharat / sports

ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాను: కోహ్లీ

author img

By

Published : Dec 28, 2020, 10:21 PM IST

క్రికెటర్​గా గొప్ప స్థాయికి ఎదగడానికి ఎన్నో కష్టాలను అధిగమించానని అన్నాడు టీమ్ఇండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీ. సవాళ్లను ఎదుర్కొంటూ తన నైపుణ్యాలను మెరుగుపరచుకున్నానని చెప్పాడు. ఐసీసీ 'దశాబ్దపు అత్యుత్తమ క్రికెటర్​'తో పాటు 'వన్డే ప్లేయర్​ ఆఫ్ ది డికేడ్​' అవార్డులను దక్కించుకున్న సందర్భంగా కోహ్లీ ఈ విధంగా మాట్లాడాడు.

If you focus on consistency alone you cant be consistent, Says Virat Kohli
ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాను: కోహ్లీ

వ్యక్తిగత ప్రదర్శనల కోసం ఎప్పుడూ ఆడనని, జట్టు విజయాల కోసమే పోరాడతానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఆ ఆలోచనే తాను నిలకడగా పరుగులు సాధించేలా చేస్తుందని తెలిపాడు. ఐసీసీ ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పురస్కారాల్లో కోహ్లీ ఈ దశాబ్దపు అత్యుత్తమ ప్లేయర్‌, 'వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ది డికేడ్‌' అవార్డులు దక్కించుకున్నాడు. దీనిపై కోహ్లీ మాట్లాడాడు.

"వ్యక్తిగత ప్రదర్శనల కోసం ఆడితే నిలకడగా పరుగులు సాధించలేరు. అదే జట్టు విజయం కోసం మైదానంలో అడుగుపెడితే సామర్థ్యానికి మించి గొప్ప ప్రదర్శన చేస్తారు. అదే అన్ని ఫార్మాట్లలో మీరు నిలకడగా ఆడేలా చేస్తుంది. 40, 50, 60 పరుగులు సాధించారా? లేదా? సెంచరీ, డబుల్‌ సెంచరీ చేశారా? అనేది ముఖ్యం కాదు. జట్టు గెలుపు కోసం ఎంతలా ప్రయత్నించారనేది కీలకం. నా ఆలోచన ధోరణి ఎప్పుడు ఇలానే ఉంటుంది. వీలైనంత సేపు బ్యాటింగ్‌ చేస్తూ జట్టును పటిష్ఠ స్థితిలో ఉంచడానికి ప్రయత్నిస్తా. మూడు ఫార్మాట్లలో సత్తాచాటడం సవాలే. అయితే నేను ఆటలో ప్రాథమిక అంశాలను పాటిస్తాను. చక్కని క్రికెటింగ్ షాట్లు ఆడటం, వాటిని మెరుగుపర్చుకోవడం చేస్తాను. అన్ని ఫార్మాట్లలో ఇదే అనుసరిస్తాను. ఫార్మాట్లను బట్టి గేర్‌ మార్చడానికి ఇది ఎంతో దోహదపడుతుంది".

- విరాట్​ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్

కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్​లో 87 టెస్టులు, 251 వన్డేలు, 84 టీ20లతో కలిపి అన్నిఫార్మాట్లలో కలిపి 22,286 పరుగులు సాధించాడు. దీనిలో 70 శతకాలు ఉన్నాయి.

గొప్ప క్రికెటర్‌గా ఎదగడానికి ఎన్నో కష్టాలను అధిగమించానని కోహ్లీ తెలిపాడు. "అంతర్జాతీయ స్థాయిలో ఏ జట్టుతో అయినా మ్యాచ్‌ అంత సులువు కాదు. గతంలో గొప్ప బౌలర్లను ఎదుర్కొంటున్నాను. ఇప్పుడూ నాణ్యమైన బౌలర్లతో ఆడుతున్నాను. నా దారిలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తూ, కఠోర శ్రమతో నా ఆటను మెరుగుపర్చుకున్నాను. నేను ప్రత్యర్థులను గౌరవిస్తాను. ఎదురయ్యే ప్రతి సవాళ్లను ఆనందంతో స్వీకరిస్తాను" అని విరాట్​ కోహ్లీ అన్నాడు.

ఇదీ చూడండి: ఐసీసీ ప్రతిష్ఠాత్మక అవార్డులు: కోహ్లీకి రెండు.. ధోనీకి ఒకటి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.