ETV Bharat / sports

'లాక్​డౌన్​లో రూల్స్​ మార్చారు.. మా చేతుల్లో ఏముంది?'

author img

By

Published : Feb 9, 2021, 7:35 PM IST

లాక్​డౌన్​లో ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ పాయింట్ల పట్టిక రూల్స్​ను మార్చడంపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు టీమ్ ​ఇండియా సారథి విరాట్​ కోహ్లr. మంగళవారం.. ఇంగ్లాండ్​పై తొలి టెస్టు ఓటమి అనంతరం ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ ​పాయింట్ల పట్టికలో భారత్​ నాలుగో స్థానానికి పడిపోయిన నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేశాడు విరాట్​.

kohli
కోహ్లీ

ఐసీసీపై పరోక్షంగా అసహనం వ్యక్తం చేశాడు టీమ్ ​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ. "లాక్​డౌన్​లో అకస్మాత్తుగా టెస్టు ర్యాంకింగ్స్​లో నిబంధనలు మార్చేస్తే.. మా చేతిలో ఏమీ ఉండదు" అని అన్నాడు.

మంగళవారం ఇంగ్లాండ్​పై టీమ్ ​ఇండియా తొలి టెస్టు ఓటమి అనంతరం ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ ​పాయింట్ల పట్టికలో భారత్​ నాలుగో స్థానానికి పడిపోయింది. ఈ నేపథ్యంలోనే పైవ్యాఖ్యలు చేశాడు కోహ్లీ.

"లాక్​డౌన్​లో అకస్మాత్తుగా నిబంధనలు​ మార్చేస్తే మా చేతుల్లో ఏం ఉంటుంది? మైదానంలో ఎలా ఆడాలనేదే మా అధీనంలో ఉంటుంది. అయినా పాయింట్ల పట్టిక గురించి మాకు ఏ బెంగ లేదు. ఇది మాపై ఎటువంటి ప్రభావం చూపదు. మా జట్టు పాయింట్ల పట్టికను దృష్టిలో పెట్టుకుని ఆడదు. ఈ టెస్టు మ్యాచ్​కు ముందు ఇంగ్లాండ్​కు టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో అర్హత సాధించే అవకాశాలున్నాయని కూడా ఎవరూ ఆలోచించి ఉండరు. కానీ ఇప్పుడు వారు టేబుల్​ అగ్రస్థానానికి చేరుకున్నారు. ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. కాబట్టి మేం వీటిని దృష్టిలో పెట్టుకుని ఆడం. మా దృష్టంతా ఎల్లప్పుడూ ఆట కోసం తీవ్రంగా శ్రమించడంపైనే మా ఉంటుంది. అందుకు మేమెప్పుడూ సిద్ధంగా ఉంటాం." అని ప్రపంచ టెస్టు ఛాంపియనషిప్​ పాయింట్ల పట్టికను ఉద్దేశిస్తూ విరాట్​ అన్నాడు.

ర్యాంకింగ్స్​ నిబంధనల్లో మార్పు

టెస్టుల ర్యాంకింగ్​లో తొమ్మిది అగ్రశ్రేణి జట్లు, రెండేళ్లలో ఆరు సిరీస్​లు ఆడాల్సి ఉంది. ప్రతి సిరీస్​కు గరిష్టంగా 120 పాయింట్లను లెక్కిస్తారు. సిరీస్​లోని మ్యాచ్​ల సంఖ్య ఆధారంగా పాయింట్ల కేటాయింపు జరుగుతుంది. అధిక పాయింట్లు ఉన్నవారు అగ్రస్థానానికి చేరుకుంటారు. అయితే కరోనా నేపథ్యంలో పలు సిరీస్​లు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో నిబంధనల్లో మార్పుల చేసింది ఐసీసీ. అధిక విజయాల శాతం ఆధారంగా జట్లకు స్థానాలను కట్టబెట్టింది. మొత్తంగా టాప్​-2లో ఉన్న జట్లే.. వచ్చే ఏడాది జూన్​లో లార్డ్స్​ వేదికగా జరిగే ఫైనల్​ ఆడనున్నాయి. గెలిచిన జట్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్ విజేత‌గా నిలుస్తుంది.

తాజా ర్యాంకింగ్స్​

ఐసీసీ మంగళవారం విడుదల చేసిన ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ పాయింట్ల పట్టికలో 70.2 విజయశాతంతో టాపర్​గా నిలిచింది ఇంగ్లాండ్​. మంగళవారం టీమ్​ ఇండియాపై తొలి టెస్టు గెలిచిన అనంతరం టేబుల్​లో అగ్రస్థానానికి ఎగబాకింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంఫియన్​షిప్​ ఫైనల్​లో అర్హత సాధించేందుకు ఆశల్ని సజీవం చేసుకుంది. ఇదే మ్యాచ్​ ఫలితం కారణంగా రెండో స్థానంలో ఉన్న భారత్ 68.3 విజయ శాతంతో​ నాలుగో స్థానానికి పడిపోయింది.

ఇదీ చూడండి: టెస్టు ఛాంపియన్​షిప్: ఇంగ్లాండ్​ టాప్​.. భారత్​ డౌన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.