టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌లు ఆటలో ఒకరికొకరు పోటాపోటీగా నిలిచినా.. మైదానంలో మాత్రం అసలైన క్రికెట్ స్పిరిట్‌ను చూపారు. గతేడాది ప్రపంచకప్‌లో ఇదే రోజున జరిగిన ఓ అపురూపమైన క్షణాన్ని తాజాగా ట్విట్టర్లో పంచుకుంది ఐసీసీ. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ 'స్పిరిట్ ఆఫ్ క్రికెట్'గా నిలిచిన ఆ సన్నివేశానికి వేదికైంది.
-
#OnThisDay last year, Virat Kohli and Steve Smith shared this wonderful moment in #CWC19 🙌#SpiritOfCricket pic.twitter.com/LImy8i7ncK
— ICC (@ICC) June 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#OnThisDay last year, Virat Kohli and Steve Smith shared this wonderful moment in #CWC19 🙌#SpiritOfCricket pic.twitter.com/LImy8i7ncK
— ICC (@ICC) June 9, 2020#OnThisDay last year, Virat Kohli and Steve Smith shared this wonderful moment in #CWC19 🙌#SpiritOfCricket pic.twitter.com/LImy8i7ncK
— ICC (@ICC) June 9, 2020
ఆ మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద ఉన్న స్టీవ్ స్మిత్‌ను భారత జట్టు అభిమానులు గేలి చేస్తున్నారు. అది గమనించిన కోహ్లీ, ప్రేక్షకులను నిశ్శబ్దంగా ఉండాలని.. గేలి చేయడానికి బదులు చప్పట్లతో స్మిత్‌ను ఉత్సాహాపరచాలని కోరాడు. ఆ సమయంలో కోహ్లీ తనకు మద్దతు ఇవ్వమని అభిమానులను కోరడం చాలా బాగుందని స్మిత్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
2019 ప్రపంచకప్ లీగ్ దశలో వరుస విజయాలతో సెమీస్‌కు దూసుకుపోయిన భారత్.. న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో ఓటమిని చవిచూసింది. టోర్నీలో 'స్పిరిట్ ఆఫ్ క్రికెట్' అవార్డును కోహ్లీ అందుకున్నాడు.
ఇదీ చూడండి... టీ20 ప్రపంచకప్ భవితవ్యం తేలేది రేపే!