భారత్-వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు నేడు ప్రారంభమవనుంది. ఈ మ్యాచ్‌తో టెస్టు ఛాంపియన్ షిప్‌ను ఆరంభించనున్నాయి ఇరు జట్లు. అయితే భారత్ జట్టులో ఆరో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారన్న విషయమై స్పష్టత లేదు. ఈ స్థానం కోసం రోహిత్ శర్మ, హనుమ విహారీ పోటీపడుతున్నారు.
టీమిండియా మజీ ఆటగాడు సెహ్వాగ్.. రోహిత్‌కు మద్దతుగా నిలిచాడు. విహారీ స్థానంలో హిట్‌మ్యాన్‌ను తీసుకోవాలని సూచించాడు.
"పిచ్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటే ఐదుగురు బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్, ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలి. ఇది ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ అయినందున డ్రా కంటే విజయమే చాలా ముఖ్యం."
-సెహ్వాగ్, టీమిండియా మాజీ ఆటగాడు.
ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్‌లో రోహిత్ మంచి ఫామ్ కనబర్చాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు రోహిత్ సరిపోతాడని.. భారీ ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యం అతడికి ఉందన్నాడు సెహ్వాగ్.
"ఆరో స్థానంలో ఎవరు ఆడతారు? నాలుగు విరాట్, ఐదు రహానే, ఆరోస్థానంలో హనుమ విహారీ ఆడాలంటున్నారు.. ఎందుకంటే విహారి బౌలింగ్ చేయగలడు. కానీ నా ప్రకారం ఆ స్థానంలో రోహిత్ ఉంటేనే మంచిది. డిక్లరేషన్ ఇచ్చే ఆలోచన ఉంటే అతడు భారీ ఇన్నింగ్స్ ఆడగలడు."
-సెహ్వాగ్, టీమిండియా మాజీ ఆటగాడు.
ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు చేసిన రోహిత్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. వెస్టిండీస్-ఏతో జరిగిన అనధికారికి టెస్టులో 55, 118* పరుగులతో విహారీ సత్తాచాటాడు. వార్మప్ మ్యాచ్‌లోనూ ఇద్దరూ ఆకట్టుకున్నారు.
ఇవీ చూడండి.. టీమిండియా టైటిల్ స్పాన్సర్‌గా పేటీఎం