ETV Bharat / sports

'ఐపీఎల్​ సహా ఆ టోర్నీలపై భారత క్రికెటర్లకు ఆసక్తి' - ఐపీఎల్ లేటేస్ట్ న్యూస్

ఐపీఎల్​తో పాటు ఇతర లీగ్​ల్లో కొందరు భారత ఆటగాళ్లు పాల్గొనాలనుకుంటున్నారని ఇంగ్లీష్ క్రికెటర్ మోర్గాన్ చెప్పాడు. వారు ఎవరనేది మాత్రం వెల్లడించలేదు.

I know Indian cricketers who want to play in 'The Hundred': Eoin Morgan
'భారత క్రికెటర్లకు 'ద హండ్రెడ్' లీగ్​పై ఆసక్తి'
author img

By

Published : Apr 2, 2021, 4:22 PM IST

Updated : Apr 2, 2021, 4:40 PM IST

చాలామంది భారత క్రికెటర్లు, 'ద హండ్రెడ్' లీగ్​లో ఆడాలనుకుంటున్నారని కోల్​కతా నైట్​రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అన్నాడు. ప్రపంచంలోని పలు లీగ్​లో పాల్గొనాలని వాళ్లు అనుకుంటున్నట్లు చెప్పాడు. ఆ ఆటగాళ్లు పేర్లు మాత్రం వెల్లడించలేదు.

ఇంగ్లాండ్​ ఆతిథ్యమివ్వనున్న 'ద హండ్రెడ్' లీగ్​లో జట్టు, ఓ ఇన్నింగ్స్​లో 100 బంతులు ఆడనుంది. గతేడాది మొదలు కావాల్సినప్పటికీ, కరోనా కారణంగా అదికాస్త వాయిదా పడింది. ఈ ఏడాది చివర్లో తిరిగి నిర్వహించే అవకాశముంది.

Eoin Morgan
ఇంగ్లాండ్ క్రికెటర్ మోర్గాన్

"వాళ్లు(పలువురు భారత క్రికెటర్లు) కూడా 'ద హండ్రెడ్'తో పాటు ఇతర లీగ్​ల్లో ఆడాలని భావిస్తున్నారు. కొత్త చోటుకు వెళ్లాలని, అక్కడ క్రికెట్​ ఆడాలని వాళ్లకు ఉంది. వారి వస్తే లీగ్​కూ ప్రాముఖ్యం పెరుగుతుంది. అయితే స్టార్ క్రికెటర్లు, జాతీయ జట్టుకు కాకుండా లీగ్​లకు ప్రాధాన్యం ఇవ్వడంపై నిర్వహకులు దృష్టిసారించి, దానిని నివారించే ప్రయత్నం చేయాలి" అని మోర్గాన్ అన్నాడు.

ఐపీఎల్​లో ​కోల్​కతా జట్టుకు మోర్గాన్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. సన్​రైజర్స్​ హైదరాబాద్​తో ఏప్రిల్ 11న జరిగే మ్యాచ్​తో ఈ సీజన్​ను ప్రారంభించనుందీ జట్టు.

Last Updated : Apr 2, 2021, 4:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.