త్వరలో ప్రారంభమయ్యే లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్)లో భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పాల్గొంటాడనే ప్రచారం జరుగుతుంది. ఈ విషయమై స్పందిస్తూ.. తాను ప్రస్తుతం ఏ లీగ్‌కు అందుబాటులో లేనని స్పష్టం చేశాడు.
ఓ నివేదిక ప్రకారం ఎల్పీఎల్లో ఆడేందుకు ఆసక్తి చూపిన 70 మంది విదేశీ ఆటగాళ్లలో పఠాన్ కూడా ఒకడు. ఐదు ఫ్రాంచైజీల్లో ఒకరైన అతడిని ఎన్నుకోకపోతే పేరును డ్రాఫ్ట్‌లో ఉంచుతారు.
-
I wish to play T20 Legues around the world in future, but at this stage I haven't confirmed my availability in any Leagues.
— Irfan Pathan (@IrfanPathan) August 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I wish to play T20 Legues around the world in future, but at this stage I haven't confirmed my availability in any Leagues.
— Irfan Pathan (@IrfanPathan) August 3, 2020I wish to play T20 Legues around the world in future, but at this stage I haven't confirmed my availability in any Leagues.
— Irfan Pathan (@IrfanPathan) August 3, 2020
"భవిష్యత్‌లో ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల్లో ఆడాలని కోరుకుంటున్నాను. కానీ, ప్రస్తుతం ఎందులోనూ పాల్గొనాలని లేదు" అని పఠాన్ ట్వీట్ చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్, దిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రైజింగ్ పుణె సూపర్‌జైంట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లకు ప్రాతినిధ్యం వహించాడు.
పఠాన్ కెరీర్
అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరపున 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20లు ఆడి 300 వికెట్లు తీశాడు ఇర్ఫాన్ పఠాన్. టెస్టుల్లో 2500 పరుగులు చేశాడు.
ఎల్పీఎల్లో ఐదు జట్లు
ఆగస్టు 28 నుంచి మొదలుకానున్న లంక ప్రీమియర్ లీగ్‌లో మొత్తం 23 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. కొలంబో, కాండీ, గాలె, దంబుల్లా, జాఫ్నా నగరాల పేరుమీద ఐదు జట్లు ఆడనున్నాయి.