టీమ్ఇండియాతో జరిగిన మూడో టెస్టులో బౌలర్ బుమ్రాను ఎదుర్కోవడం ప్లేస్టేషన్లో క్రికెట్ ఆడిన ఆనుభూతి కలిగిందని అన్నాడు ఆసీస్ యువ ఆటగాడు విల్పకోస్కీ. ఈ మ్యాచును తాను ఎంతగానో ఆస్వాదించినట్లు చెప్పాడు.
"నేను నిజంగా చెప్తున్నా.. సిడ్నీ టెస్టులో బుమ్రాను ఎదుర్కోవడం ప్లేస్టేషన్లో ఆడినట్టుంది. నాకు ఇంకా చిన్నప్పడు జరిగిన ఓ సంఘటన బాగా గుర్తుంది. అనారోగ్యంగా ఉన్నానని అబద్ధం చెప్పి పాఠశాలకు సెలవు పెట్టి ప్లేస్టేషన్ ఆడేవాడిని. అయితే ఇందులో నా పాత్ర ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ షేన్ వాట్సన్. ఇంగ్లాండ్తో యాషెస్ సిరీస్ ఆడేవాడిని. అప్పుడు అతనంటే నాకు చాలా బాగా ఇష్టం. ఇప్పుడు మూడో టెస్టులో ఆడినప్పుడు కూడా అదే అనుభూతి కల్గింది. వాట్సన్ లాగా ఆడుతున్నట్లు భావించాను. బుమ్రా టాప్ బౌలర్. అతడిని ఎదుర్కొన్నప్పుడు.. ప్లేస్టేషన్లో ఇంగ్లాండ్తో యాషెస్ సిరీస్ తలపడినట్లు అనిపించింది. ఇప్పటికీ ప్లేస్టేషన్ ఆడుతూనే ఉన్నాను."
-పకోస్కీ, ఆస్ట్రేలియా క్రికెటర్.
ఈ సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది టీమ్ఇండియా. బోర్డర్-గావస్కర్ సిరీస్ ట్రోఫీని చేజారనివ్వకుండా తమ వద్దే ఉంచుకుంది. ఫిబ్రవరి 5నుంచి ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ఆడనుంది భారత్.
'బుమ్రాను ఎదుర్కొన్నప్పుడు ప్లేస్టేషన్ ఆడినట్టుంది'
ఇదీ చూడండి: పకోస్కీ.. ఆసీస్ భవిష్యత్ స్టార్: పాంటింగ్