ETV Bharat / sports

ఐపీఎల్​లో విహారి కూడా ఆడాల్సింది: పుజారా

ఈసారి ఐపీఎల్​కు దూరమైన హనుమ విహారి కూడా లీగ్​లో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు టీమ్​ఇండియా క్రికెటర్​ ఛెతేశ్వర్ పుజారా. గతంలో తానొక్కడినే టోర్నీకి దూరమయ్యేవాడినని పేర్కొన్నాడు. ప్రస్తుత సీజన్​కు దూరమైన విహారి కూడా లీగ్​లో ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.

"I feel Hanuma Vihari should also be part of IPL," says Cheteshwar Pujara
'ఐపీఎల్​లో విహారి కూడా భాగమైతే బాగుండు'
author img

By

Published : Apr 4, 2021, 10:30 AM IST

టీమ్​ఇండియా బ్యాట్స్​మెన్​ హనుమ విహారి కూడా ప్రస్తుత ఐపీఎల్​లో ఉంటే బాగుండేదని ఆశాభావం వ్యక్తం చేశాడు సీఎస్కే ఆటగాడు ఛెతేశ్వర్ పుజారా. గత కొన్ని సీజన్లలో తానొక్కడినే లీగ్​కు దూరమయ్యానని.. అయితే ప్రస్తుతం తనని సీఎస్కే కొనుగోలు చేసిందని తెలిపాడు. చివరి సారి ఐపీఎల్​లో ఆడిన విహారి తాజా టోర్నీకి దూరమయ్యాడని.. అతడిని కూడా ఏదైనా ఫ్రాంఛైజీ తీసుకుంటే బాగుండేదని పేర్కొన్నాడు నయావాల్​.

"నేను టీమ్​ఇండియా కోసం పడ్డ కష్టం.. నాకు ఈ రూపంలో కలిసొచ్చింది. నన్ను వేలంలో చెన్నై కొనుగోలు చేయగానే, వేలం రూమ్​లో అన్ని ఫ్రాంఛైజీలు చప్పట్లతో అభినందించాయి. భారత జట్టు సహచరులంతా సంతోషపడ్డారు. గత కొన్నేళ్లుగా నేనొక్కడినే లీగ్​కు ఎంపిక కాలేకపోయాను. కానీ, ఈసారి నన్ను సీఎస్కే దక్కించుకుంది. ఈసారి ఒక్క హనుమ విహారి మాత్రమే దూరమయ్యాడు. అతడు కూడా ఉంటే బాగుండేది.

-ఛెతేశ్వర్ పుజారా, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు.

గత ఆసీస్ పర్యటనలో ఈ ఇద్దరు క్లాస్ ప్లేయర్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. 2-1తో టెస్టు సిరీస్ కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించారు. బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీలో పుజారా ప్రదర్శనుకు గాను ఇది మేమిచ్చిన బహుమతి అని సీఎస్కే వేలం అనంతరం వెల్లడించింది.

ఇదీ చదవండి: ఐపీఎల్​లో పునరాగమనం ఉద్వేగంగా ఉంది: పుజారా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.