ETV Bharat / sports

'ఇంగ్లాండ్​‌ ఒక్క టెస్టు‌ కూడా గెలవలేదు' - I don't see England winning any Test against India gambhir

టీమ్​ఇండియాతో జరగబోయే టెస్టు సిరీస్​.. ఇంగ్లాండ్​ సారథి జో రూట్​కు చేదు అనుభవాల్ని మిగిలిస్తుందని అన్నాడు భారత మాజీ ఓపెనర్​ గంభీర్​. ప్రత్యర్థి జట్టులో మొయిన్‌ అలీ మినహా మిగతా స్పిన్నర్లెవరూ భారత్‌పై అంతగా ప్రభావం చూపలేరని అన్నాడు.

gambir
గంభీర్​
author img

By

Published : Feb 2, 2021, 5:35 AM IST

టీమ్​ఇండియాతో జరగబోయే టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్​ జట్టు ఒక్క మ్యాచు కూడా గెలిచే అవకాశం లేదని టీమ్​ఇండియా మాజీ ఓపెనర్‌ గంభీర్‌ జోస్యం చెప్పాడు. వైట్​వాష్​ అవుతుందని చెప్పాడు. ఇంగ్లీష్‌ జట్టు పేలవమైన స్పిన్‌ దళంతో బరిలోకి దిగుతుందని, ఇది భారత జట్టుకు కలిసొచ్చే అవకాశమని వెల్లడించాడు.

ఇంగ్లాండ్​ జట్టు స్పిన్‌ విభాగానికి సారథ్యం వహిస్తున్న మొయిన్‌ అలీ మినహా మిగతా స్పిన్నర్లెవరూ భారత్‌పై అంతగా ప్రభావం చూపలేరని అన్నాడు. 60 టెస్టుల్లో 181 వికెట్లు సాధించిన అలీ ఒక్కడే కాస్త ప్రభావం చూపగలడని పేర్కొన్నాడు. ఇంగ్లీష్‌ స్పిన్నర్లు డామ్‌ బెస్‌, జాక్‌ లీచ్‌లను భారత బ్యాట్స్‌మెన్​.. అవలీలగా ఎదుర్కొంటారని అన్నాడు.

శ్రీలంకపై 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లాండ్​ సారథి జో రూట్‌కు ఈ సిరీస్‌ చేదు అనుభవాల్ని మిగిలిస్తుందని గంభీర్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. భారత బౌలర్లు బుమ్రా, అశ్విన్‌లు ఈ సిరీస్‌లో కీలకం కానున్నారని అన్నాడు.

షెడ్యూల్​ ఇదే

భారత​ పర్యటనలో ఇంగ్లాండ్ నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. తొలుత ఫిబ్రవరి 5 నుంచి జరిగే టెస్టుతో పర్యటన ప్రారంభం కానుంది. మొదటి రెండు టెస్టులు చెన్నైలో జరగనుండగా, మూడోదైన డేనైట్ మ్యాచ్​తో పాటు నాలుగో టెస్టుకు అహ్మదాబాద్ (మెతేరా స్టేడియం) వేదిక కానుంది. తర్వాత టీ20 సిరీస్​ కోసం ఇరుజట్లు సిద్ధమవనున్నాయి.

ఇదీ చూడండి : 'కోహ్లీ సారథ్యంలో టీమ్​ఇండియా​ జోరు తగ్గదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.