ETV Bharat / sports

'పంత్​ లేని జట్టును ఊహించగలమా?'

author img

By

Published : Mar 29, 2021, 5:46 PM IST

టీమ్​ఇండియా యువకెరటం రిషభ్​ పంత్​ లేని భారత జట్టును తాను ఊహించలేనని తెలిపాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్​ ఇయాన్ బెల్. అతడొక నిజమైన మ్యాచ్​ విన్నర్ అని కొనియాడాడు.

"I can't imagine now an Indian side without Rishabh Pant" - Ian Bell
'పంత్​ లేని టీమ్​ఇండియాను ఊహించలేం'

టీమ్​ఇండియా యువ బ్యాట్స్​మెన్ రిషభ్​ పంత్​పై ప్రశంసల వర్షం కురిపించాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్​ ఇయాన్ బెల్. పంత్​ లేని భారత జట్టును ఊహించడం కష్టమని తెలిపాడు. అతడొక నిజమైన మ్యాచ్​ విన్నర్​ అని పేర్కొన్నాడు. తాజాగా ఇంగ్లాండ్​తో జరిగిన సిరీస్​లో పంత్​ ఆట తీరులో చాలా మార్పు వచ్చిందని బెల్​ అభిప్రాయపడ్డాడు.

"మూడు ఫార్మాట్లలోనూ పంత్​ మంచి పరిణతితో కూడిన ఆటతీరు ప్రదర్శించాడు. ఇంగ్లాండ్​తో మంచి సిరీస్​ ఆడాడు. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోయాడు" అని బెల్​ కొనియాడాడు.

ఇంగ్లాండ్​తో సిరీస్​లో అహ్మదాబాద్​ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్నాడు పంత్​. వన్డే సిరీస్​లో 77, 78 పరుగులు చేశాడు. తొలి వన్డేకు తుది జట్టులో స్థానం లభించలేదు.

ఇదీ చదవండి: ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు- పెరీరా రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.