టెస్టు క్రికెట్లో 400 వికెట్లు తీసిన ఘనతను సొంతం చేసుకున్న భారత స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను అనుకోకుండా క్రికెటర్ అయ్యాడని పేర్కొన్నాడు.
"నేను క్రికెటర్ అవుతానని, టీమ్ఇండియా జెర్సీ వేసుకుంటానని కలలో కూడా భావించలేదు. క్రికెట్ ప్రేమికుడి నుంచి క్రికెటర్గా ఎదిగాను. "
- అశ్విన్, టీమ్ఇండియా బౌలర్.
'టీమ్ఇండియా తరఫున ఆడినందుకు అదృష్టవంతుడిని' అని కొవిడ్-19 సమయంలో అర్థమైనట్లు అశ్విన్ తెలిపాడు. ఐపీఎల్ ఆడిన తర్వాత ఆస్ట్రేలియాలో ఆడే అవకాశం వస్తుందని భావించలేదన్న అశ్విన్... ప్రతి అవకాశం ఓ బహుమతిలాంటిదే అని అన్నాడు.
ఇదీ చదవండి:అసోం డీఎస్పీగా అథ్లెట్ హిమాదాస్