ETV Bharat / sports

సంజూ శాంసన్ ఐదేళ్ల 'కల' నెరవేర్చిన ధోనీ - సంజూ శాంసన్ కల నెరవేర్చిన ధోనీ

తనకు ఐదేళ్ల పాటు నిద్రలో వచ్చిన కలను, టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ నెరవేర్చాడని చెప్పుకొచ్చాడు సంజూ శాంసన్. ఇంతకీ ఆ కల ఏంటంటే?

సంజూ శాంసన్ ఐదేళ్ల 'కల' నెరవేర్చిన ధోనీ
సంజూ శాంసన్ ధోనీ
author img

By

Published : May 5, 2020, 5:45 AM IST

Updated : May 5, 2020, 7:26 AM IST

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ.. తనకు ఐదేళ్లుగా వచ్చిన ఓ కలను నిజం చేశాడని చెప్పాడు యువ క్రికెటర్ సంజూ శాంసన్. చెన్నై సూపర్​ కింగ్స్ తాజాగా నిర్వహించిన లైవ్​చాట్​లో పాల్గొన్న సంజూ.. ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ వీడియోను సీఎస్క్​ ట్వీట్ చేసింది.

"19 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్​ పర్యటన సందర్భంగా ధోనీతో డ్రెస్సింగ్ రూమ్​ పంచుకున్నా. అప్పుడు అతడితో తొలిసారి మాట్లాడా. ఆ తర్వాత ఐదేళ్ల పాటు జట్టులో చోటు దక్కలేదు. అన్ని రోజులు రాత్రుళ్లు ఒకే కల వచ్చేది. వికెట్ల వెనకుండి మహీ భాయ్.. ఫీల్డింగ్​ మారుస్తుంటాడు. స్లిప్​లో ఉన్న నన్ను, అటు వెళ్లు అని అనగానే పరిగెత్తుకువెళ్లేవాడిని" -సంజూ శాంసన్, భారత యువ క్రికెటర్

అయితే కొన్ని రోజుల తర్వాత ధోనీ సారథ్యం నుంచి తప్పుకున్నాడనే వార్త విని చాలా బాధపడినట్లు చెప్పాడు సంజూ. అప్పుడు తన కల కలగానే మిగిలిపోతుందని భయపడ్డానని అన్నాడు. కానీ కొన్నిరోజుల తర్వాత భారత్ ఏ-ఇంగ్లాండ్ మధ్య జరిగిన​ మ్యాచ్​తో అది తీరిందని వెల్లడించాడు.

ఈ మ్యాచ్​లో ధోనీ కెప్టెన్సీ చేశాడని, కలలో వచ్చినట్లు తాను స్లిప్​లో నిల్చున్నానని సంజూ చెప్పాడు. ఓ సమయంలో మహీ తనను అటు వెళ్లమన్నాడని, దీంతో కల నిజమైందని వివరించాడు.

Last Updated : May 5, 2020, 7:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.