టీమిండియా తొలిసారిగా డే/నైట్ టెస్టు ఆడేందుకు సన్నద్ధమవుతోంది. సంప్రదాయ ఎరుపు బంతికి భిన్నంగా పింక్ బాల్‌తో పోరుకు సన్నాహకాలు ప్రారంభించింది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, శ్రీలంక, జింబాబ్వే ఈ గులాబి బంతి మజాను ఆస్వాదించగా.. తొలిసారి భారత్-బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి.
అయితే ఇప్పటివరకు 11 డే/నైట్ మ్యాచ్‌లు జరగ్గా ఒక్కటీ.. డ్రా కాకపోవడం విశేషం. ఆస్ట్రేలియా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి.. డై/నైట్ టెస్టుల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది.
శ్రీలంక.. మూడు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలతో రెండో స్థానంలో ఉంది. ఈ మూడు మ్యాచ్‌లూ ఉపఖండం బయట జరగడం విశేషం. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ చెరో మ్యాచ్ గెలిచి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వెస్టిండీస్ మాత్రం ఆడిన మూడు మ్యాచ్‌లనూ ఓడి, చివరి స్థానంలో నిలిచింది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య శుక్రవారం (22వతేదీ) ఈ చారిత్రక టెస్టు ప్రారంభం కానుంది. ఇందుకోసం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ముస్తాబవుతోంది. మొదటి మూడు రోజులు.. రోజుకు దాదాపు 65 వేల మంది ప్రేక్షకులు హాజరవుతారని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తెలిపాడు.
ఇవీ చూడండి.. 'సవ్యసాచి' బౌలింగ్‌కు నెటిజన్ల ఫిదా!