ETV Bharat / sports

కెప్టెన్ కోహ్లీ 'హలో'కు చాహల్ ఫన్నీ రిప్లై

ఐపీఎల్​ కోసం దుబాయ్​ చేరుకున్న తర్వాత కోహ్లీ ఓ ఫొటో పోస్ట్ చేయగా, దానికి హాస్యభరిత కామెంట్ జోడించాడు స్పిన్నర్ చాహల్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బృందం యూఈఏకి శుక్రవారం చేరుకుంది.

కెప్టెన్ కోహ్లీ 'హలో'కు చాహల్ ఫన్నీ రిప్లై
కోహ్లీ-చాహల్
author img

By

Published : Aug 22, 2020, 5:35 AM IST

రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ ఆడేందుకు యూఏఈకి​ వెళ్లింది. ఆతిథ్య దేశంలో అడుగుపెట్టిన కెప్టెన్​ కోహ్లీ.. 'హలో దుబాయ్' అంటూ పోస్ట్ పెట్టాడు. స్పందించిన స్పిన్నర్​ చాహల్.. 'అదే హోటల్​ నుంచి హలో భయ్యా' అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చాడు.

సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు జరగనున్న ఈ సీజన్​ కోసం ప్రత్యేక విమానాల్లో పలు జట్లకు చెందిన భారత్​ ఆటగాళ్లు యూఏఈకి చేరుకున్నారు. తొలి ఆరు రోజుల పాటు వారికి కేటాయించిన హోటల్​ గదుల్లోనే క్వారంటైన్​లో ఉండనున్నారు. ఈ సమయంలో వారికి మూడుసార్లు వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో నెగటివ్​గా తేలిన తర్వాతే శిక్షణా శిబిరంలోకి అడుగుపెడతారు. దిల్లీ క్యాపిటల్స్, సన్​రైజర్స్ హైదరాబాద్​ మినహా మిగతా జట్లన్నీఇప్పటికే యూఏఈ చేరుకున్నాయి. ఇవి రెండు శనివారం అక్కడికి వెళ్లనున్నాయి.

కోహ్లీ సారథ్యం వహిస్తున్న బెంగళూరు.. ఇప్పటివరకు విజేతగా నిలవడంలో విఫలమైంది. ఈసారి మాత్రం ఎలాగైనా కప్పు కొట్టాలని కసితో ఉంది. ఆటగాళ్లు కూడా అదే ఉత్సాహంతో కనిపిస్తున్నారు.

ఐపీఎల్​లో 177 మ్యాచ్​లాడిన కోహ్లీ.. 5,412 పరుగులతో టాప్​ స్కోరర్​గా కొనసాగుతున్నాడు. ఈ సీజన్​లోనే అదే ఫామ్​ను కొనసాగించి, జట్టును విజేతగా నిలుపుతాడని అభిమానులు భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.